PRABHAS: సలార్ ఈజ్ బ్యాక్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ప్రభాస్..!

కానీ కొన్ని రోజుల క్రితం మోకాలి సర్జరీ కోసం యూరప్‌ (Italy) వెళ్లాడు ప్రభాస్. అక్కడే రెస్ట్‌ మోడ్‌లో ఉన్నాడు. అక్టోబర్ 23న బర్త్ డే వేడుకలు కూడా అక్కడే జరుపుకున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 04:00 PM IST

PRABHAS: డిసెంబర్ 22న థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనున్న సలార్ (Salaar) మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ (PRABHAS) ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. సలార్ థియేటర్లలోకి రావడమే లేట్.. బాక్సాఫీస్ బద్దలవుతుందని అంటున్నారు రెబల్ ఫ్యాన్స్. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసి, ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. కానీ కొన్ని రోజుల క్రితం మోకాలి సర్జరీ కోసం యూరప్‌ (Italy) వెళ్లాడు ప్రభాస్. అక్కడే రెస్ట్‌ మోడ్‌లో ఉన్నాడు.

Devara: భయానికి మరో కొత్త పేరు దేవర.. 150 రోజుల్లో ఊచకోత

అక్టోబర్ 23న బర్త్ డే వేడుకలు కూడా అక్కడే జరుపుకున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు ప్రభాస్. అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్‌లో నిజంగానే డైనోసర్‌లా కనిపిస్తున్నాడు ప్రభాస్. దీంతో సలార్ ఈజ్ బ్యాక్ అని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఇక డార్లింగ్ ఇండియాకు వచ్చేశాడు కాబట్టి.. త్వరలోనే సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి. కానీ ఈలోపు మారుతి సినిమాకు సంబంధిచి ఓ షెడ్యూల్‌ కంప్లీట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ‘సలార్’ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగనున్నాడు ప్రభాస్. నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

Anasuya Bharadwaj: అనసూయ సెన్సేషనల్ కామెంట్స్.. అడివి శేష్‌ను వదలని అనసూయ

ట్రైలర్ కూడా ఆ సమయంలోనే రిలీజ్ చేసే అవకాశముంది. త్వరలోనే హోంబలే వారు సలార్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒక్కసారి ట్రైలర్ బయటికొస్తే.. సలార్ బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోనున్నాయి. మరి సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.