PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్ బిరుదు రెబల్ ఏమో కాని ఈ హీరో మాత్రం అందరి డార్లింగ్. తనకి పాన్ ఇండియా రేంజ్‌లో ఇమేజ్, మార్కెట్ ఉంది కాబట్టి తన రెమ్యూనరేషన్ 100 నుంచి 200 కోట్ల వరకు పెరిగింది. అయినా తనకి అంతకుమించి పారితోషికం ఇవ్వటానికి నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కారణం తన మీద ఎంత పెట్టుబడి పెట్టినా తిరిగొస్తుంది కాబట్టి. ఆమాత్రానికే చాలా మంది హీరోలతో పోలిస్తే ప్రభాస్ గొప్పా అంటే.. కానే కాదు. ఇంకా చాలా కారాణాలున్నాయి.
SS RAJAMOULI: మహేశ్ సినిమా తర్వాత రాజమౌళి హీరో ఎవరు?
ప్రభాస్ ఒక్కసారి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుంటే, అడిషనల్ ఛార్జ్ తీసుకోడు. మేకప్ మెన్, మేనేజర్, అసిస్టెంట్స్ ఇలా తన టీంకి స్పెషల్ ఛార్జ్‌లు వేయడట. ఇక తన సొంతకార్లోనే వస్తాడు. తన మరో కార్లో తన టీం వస్తుంది. సో.. అక్కడా ప్రొడ్యూసర్ సేఫ్. ఈమాత్రం చిన్న ఖర్చులు పెద్ద లెక్కా అంటే.. నిజానికి నెలలు, సంవత్సరాలు తెరకెక్కే సినిమాలకు ఈ చిల్లర ఖర్చులే ఓ మినీ బడ్జెట్ మూవీకి కావాల్సినంత పెట్టుబడవుతుంది. కొంతమంది హీరోలైతే వాళ్ల అదర్ ఎక్స్‌పెన్సెస్‌తో విసిగిస్తారనే కామెంట్స్ ఉన్నాయి. డ్రైవర్ జీతం నుంచి అస్టిస్టెంట్ ఫీజు, మేకప్ ఆర్టిస్ట్‌కి ఛార్జ్ చేస్తారు. ఇక సొంత కారవాన్ ఉంటే దాని ఛార్జ్ కూడా నిర్మాతకే పంచ్ పడుతుందనంటారు. ఇక ప్రభాస్ విషయానికొస్తే తను అలాంటి ఛార్జ్‌లు తీసుకోడట.
ఫుడ్ తనే తెస్తాడు. తన టీంతోపాటు దర్శక నిర్మాతలకు క్యారియర్లు వచ్చేస్తాయి. అంతలా ఎక్స్‌ట్రా ఖర్చులకు కల్లెం వేయటమే కాకుండా తన ప్రేమని కూడా పంచుతాడు కాబట్టే తను డార్లింగ్ అయ్యాడు. తన డూప్‌కి అయ్యే ఖర్చు తనదే, తన బాడీగార్డ్‌కి తనే శాలరీ ఇస్తాడు. ఇవేవి నిర్మాతతో సంబంధం లేదంటాడు.. కాబట్టే తను డైరెక్టర్స్ డార్లింగ్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్స్ ఫేవరెట్ కూడా.