PRABHAS: ఇప్పటి కాలంలో హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే చాలా గొప్ప. అలాంటిది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్స్‌కి కమిట్ అవుతున్నాడు. ఒక సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యేలోపు మరో రెండు ప్రాజెక్ట్స్‌కి ఓకే చెబుతున్నాడు. 2024లో కూడా ఇదే జోరు కంటిన్యూ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బాహుబలితో సత్తా చాటిన ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా మూడు సినిమాలు ప్లాప్ అయినా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సలార్‌ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్న ప్రభాస్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కల్కిని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్‌ని ఫినిష్ చేస్తూనే స్పిరిట్ మూవీని సెట్స్‌పైకి తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే ఇవి ఫినిష్ కాకుండానే ప్రభాస్ మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీతారామం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు హను రాఘవపూడి. ఈ సినిమా తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న తను ప్రభాస్ కోసం ఓ కథ రెడీ చేశాడు. ఈ స్టోరీ లైన్ నచ్చడంతో డార్లింగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పిరిట్ మూవీ, హను ప్రాజెక్ట్ ఓకేసారి స్టార్ట్ చేసేలా ప్రభాస్ ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాడట.
అలాగే బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అయితే వార్ 2 రిజల్ట్‌ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటాడట. మొత్తానికి ప్రభాస్ రాబోయే సినిమాలు చూస్తుంటే వచ్చే మూడేళ్లు కూడా ఫుల్ బిజీగా ఉండేలా కనిపిస్తున్నాడు.