సలార్ (Salar) బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ జోరు మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిన ఈ ఆరడుగుల కటౌట్.. పాన్ ఇండియా షేక్ అయ్యే ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ దుమ్ము రేపుతున్నాడు. హ్యాట్రిక్ మూవీలు డిజాస్టర్లుగా మిగిలినా రీసెంట్గా వచ్చిన సలార్ మాత్రం ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. ప్రజెంట్ కల్కి (Kalki), రాజా సాబ్ (Raja Saab) సహా పలు భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా మారాడు. ప్రభాస్ (Prabhas) నుంచి రాబోయే నెక్ట్స్ మూవీస్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలో డార్లింగ్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్‌ను ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.
ప్రభాస్ గత కొద్ది కాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.. ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నడవడానికి చాలా ఇబ్బంది పడ్డ డార్లింగ్‌ను చూసి ఫ్యాన్స్ చాలా ఫీలయ్యారు. సలార్ రిలీజ్ టైంలో కూడా ప్రమోషన్స్ కు దూరంగా ఉండటంతో పాటు యూరప్ కు వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు . అక్కడే నెల రోజులు విశ్రాంతి తీసుకొని తర్వాత ఇండియాకి వచ్చాడు. రీసెంట్ గా కల్కి రొమాంటిక్ సాంగ్ కోసం ఇటలీకి వెళ్లాడు. అయితే అంతా బాగుంది అనుకుంటున్న టైమ్‌లో ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫొటో ఫ్యాన్స్‌ను కంగారు పడేలా చేస్తోంది.
కల్కి నుంచి శివరాత్రి సందర్భంగా మేకర్స్ రెండు ఫోటోలను వదిలారు. ఒకటి లోకేషన్ దగ్గర ప్రైవేట్ జెట్ ఫ్లైట్ దగ్గర టీం మెంబర్స్ అందరూ ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఆ తర్వాత కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ కు సంబంధించిన భైరవ పోస్టర్ రిలీజ్ చేశారు. కట్ చేస్తే… అసలు డౌట్ మొదటి ఫోటోతోనే మొదలైంది. ప్రైవేట్ జెట్ ఫ్లైట్ దిగుతూ కనిపించాడు ప్రభాస్. అసలు మ్యాటరేంటంటే… ప్రభాస్ చాలా ఇబ్బంది పడుతూ జాగ్రత్తగా ఫ్లైట్ దిగడం కనిపించడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుండటంతో.. ప్రభాస్‌కు మోకాలినొప్పి తగ్గలేదా అంటూ ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. ఇంకా ఆ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడా అంటూ మదనపడుతున్నారు. మెకాలి నొప్పి నుంచి త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు.