KALKI 2898 AD: ప్రభాస్ కల్కి.. ఓటిటి రైట్స్ కోసం భారీ పోటీ నిజమేనా..?

లేటెస్టుగా ప్రభాస్ గురించి వస్తున్న ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD తెలుగులో తెరకెక్కుతున్న మొట్టమొదటి ఎడ్వెంచర్ మూవీ. భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరికీ ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 03:28 PM IST

KALKI 2898 AD: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. ఆయన సినిమాల కోసం నేడు ఇండియా వ్యాప్తంగా కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఇక సోషల్ మీడియాకి, ప్రభాస్‌కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఉంది. డార్లింగ్ గురించి వార్త రాకపోతే సోషల్ మీడియాకి అసలు పొద్దు కూడా పోదు. లేటెస్టుగా ప్రభాస్ గురించి వస్తున్న ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD తెలుగులో తెరకెక్కుతున్న మొట్టమొదటి ఎడ్వెంచర్ మూవీ.

Emraan Hashmi: ఫ‌స్ట్ లుక్ రిలీజ్.. ఓజీ’ నుంచి మెంటలెక్కించే పోస్టర్

భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరికీ ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇపుడు ఈ మూవీ గురించే ఒక ఇంట్రెస్ట్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. కల్కి ఓటిటి రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి బడా సంస్థలు పోటీపడుతున్నాయట. మేకర్స్ రూ.200 కోట్లకి పైగా చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ సదరు ఓటీటీ సంస్థలు మాత్రం రూ.150 నుంచి 170 కోట్ల దాకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో కొన్ని రోజులు ఆగితేగాని తెలియదు. దీపికా పదుకునే హీరోయిన్‌గా చేస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరో హీరోయిన్ దిశా పాటని కీలక పాత్రలో చేస్తుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం చేస్తుండగా, వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. ఇక మే 9న రిలీజ్ అవుతుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఇండియా వైడ్ లోక్‌సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీంతో మూవీ వాయిదా పడుతుందేమో చూడాలి. మేకర్స్ నుంచి ఇప్పటికైతే దీనిపై ఎలాంటి సమాచారం లేదు