KALKI 2898 AD: కల్కి మూవీ వాయిదా కన్పామ్ అయ్యిందని, ఆగస్ట్ 15న లేదా సెప్టెంబర్‌లో.. అదీ కుదరకపోత అక్టోబర్‌లో విడుదల అంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఏంటంటే, నిజంగానే ఈసినిమా షూటింగ్ వల్ల, అలానే గ్రాఫిక్స్ వర్క్ వల్ల విడుదల వాయిదా వేయక తప్పట్లేదట. మే 9న రావాల్సిన ఈ సినిమా దాదాపు వాయిదా పడబోతోంది. కాని సినిమా వచ్చేది మేలో నే. అవును.. మే 9 నుంచి మే 30కి వాయిదా పడే ఛాన్స్ ఉందట.
Trivikram: మాటల మాంత్రికుడి సాయం.. నితీష్ మాటకు త్రివిక్రమ్ ఓకే చెప్తారా..?
ఇది కేవలం రెబల్ స్టార్ ప్రెజర్ వల్లే జరుగుతోందని తెలుస్తోంది. మోకాలు నొప్పితో బాధపడుతూ కూడా పెండింగ్ షూటింగ్‌ని పూర్తి చేయబోయాడు ప్రభాస్. ప్యాచ్ వర్క్‌ని కూడా పూర్తి చేస్తానన్నాడు. ఇలాంటి టైంలో ప్రమోషన్‌కు టైం లేదని మే 9నుంచి వాయిదా వేస్తే, మళ్లీ రిలీజ్‌కి సెట్ అయ్యే ముహుర్తాలు లేవు. దీనికి తోడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సలార్‌కి సాలిడ్ ప్రమోషన్ చేయలేదు. కాని పాన్ ఇండియా లెవల్లో రూ.750 కోట్ల పైనే వసూళ్లొచ్చాయి. కాబట్టి, మూవీలో మ్యాటర్ ఉంటే, ప్రభాస్ ఇమేజ్‌కి ఆటోమేటిగ్గా రావాల్సిన వసూళ్లొస్తాయి. అదే కాన్ఫిడెన్స్‌తో ప్రభాస్ కల్కి వాయిదా విషయంలో నో చెబుతున్నాడట.
అంతగా వాయిదా వేస్తే మే 30 కి వాయిదా వేసి, మే నెలంతా సినిమా ప్రమోషన్‌కి కేటాయించొచ్చనే అభిప్రాయానికొచ్చాడట. దీంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కూడా ఏకీభవించారు. మే 30 లేదంటే 31 కి రిలీజ్ డేట్ మార్చే పనుల్లో ఉందట చిత్ర టీం. ఆల్రెడీ మీడియాకు ఫీలర్స్ వదిలారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా మే నెలాఖరులో రిలీజ్ కోసం సిద్ధమవుతున్నారు.