KALKI 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఝలక్ ఇచ్చేలా ఉన్న కల్కి టీం..?

మార్చ్ నెలైపోతోంది. మే 9కి నెలమీద ఒక వారమే టైం ఉంది. కాబట్టి.. ప్రభాస్ సినిమా రాబోతోందంటే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్ ఉండాలి. అదే మిస్సవుతోంది. సరే సలార్‌కి ప్రమోషన్ చేయకున్నా వందలకోట్లొచ్చాయి.

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 04:30 PM IST

KALKI 2898 AD: కల్కి మూవీ కథ కంచికి వచ్చిందని మూడునెలలుగా చెబుతున్నారు. మొన్న ఇటలీ షూటింగ్, ఇప్పుడు ప్యాచ్ వర్క్.. ఇలా ఫిల్మ్ టీం చెబుతూనే ఉంది. కాని షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. విలన్ అనుకున్న కమల్ హాసన్ కూడా తన పాత్ర కేవలం గెస్ట్ వరకే అన్నాక కూడా షూటింగ్ పూర్తవ్వలేదు. ఇవన్నీ చూస్తుంటే మే 9కి సినిమా రిలీజ్ కష్టమే అని అనుకోవాల్సి వస్తోంది.

Vishwambhara: 30 ఏళ్ల త‌ర్వాత చిరు-కీరవాణి కాంబో.. సంగీతం ఎలా ఉండబోతుందంటే.

మార్చ్ నెలైపోతోంది. మే 9కి నెలమీద ఒక వారమే టైం ఉంది. కాబట్టి.. ప్రభాస్ సినిమా రాబోతోందంటే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్ ఉండాలి. అదే మిస్సవుతోంది. సరే సలార్‌కి ప్రమోషన్ చేయకున్నా వందలకోట్లొచ్చాయి. కాబట్టి కల్కికి పాన్ ఇండియా ప్రమోషన్ లేదనుకుందాం. కాని ఇది పాన్ ఇండియా మూవీ కాదు. పాన్ వరల్డ్ సినిమా. అలాంటప్పుడు యూఎస్‌లో, యూరప్‌లో ప్రమోషన్ నెల క్రితమే మొదలుపెట్టాలి. కానీ నెల తర్వాత కూడా ప్రమోషన్ జరిగేలా లేదు. అన్నింటికి మించి నిర్మాత అశ్వినీదత్తే ఇప్పుడు కొంపముంచే పని చేస్తున్నాడట. తను రీసెంట్‌గా డిస్ట్రిబ్యూటర్స్‌తో చేసిన డిస్కర్షనే కల్కి కొంపముంచేలా ఉంది.

అదేంటంటే, ఒకవేళ మే 9న కల్కి రిలీజ్ కాకపోతే, నెక్ట్స్ మంచి రిలీజ్ డేట్ ఏదనే ప్రశ్న అశ్వినీ దత్ అడిగారట. దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఆగస్ట్ 15 అన్నారట. అంతే మే 9న కల్కి రాదని పుష్ప 2 వాయిదా పడితే ఆగస్ట్ 15 నే కల్కి వస్తాడని, అది కుదరకపోతే, రిలీజ్ డేట్ కోసం ఫైట్ తప్పదనే ప్రచారం మొదలైంది.