రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి వంగ మూవీ 2025 సమ్మర్ లో మొదలౌతుందని వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎంత సేపు స్పిరిట్ మూవీ ఎప్పుడు మొదలౌతుందని చెబుతున్నారే కాని, ఆలోపు ఇంకే సినిమాలు పూర్తవుతున్నాయో మాత్రం ఎవరూ ఫోకస్ చేయట్లేదు. స్పిరిట్ సినిమా మొదలవ్వాలంటే సందీప్ రెడ్డి పెట్టిన కండీషన్ గురించి బయటెక్కడా చర్చ జరగట్లేదు. స్పిరిట్ షూటింగ్ మొదలవ్వాలంటే రెబల్ స్టార్ మరే సినిమా చేయకూడదనేది సందీప్ రెడ్డి కండీషన్. దానికి ప్రభాస్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ నిర్ణయం వల్లే రెండు విషయాలు కన్ఫామ్ అయ్యాయి… ఒకటి తన రాజా సాబ్ షూటింగ్ ఎప్పుడు పూర్తికాబోతోందో తేలింది… రెండో విషయం ఫౌజీ షూటింగ్ కూడా ఎక్కువ రోజులుండదని తేలింది… ఇది కాకుండా ప్రభాస్ ఏకంగా 3 పెద్ద నిర్ణయాలు తీసుకున్నాడు… సలార్ సీక్వెల్ ఇప్పట్లో కాదని అంతా అన్నారు. కాని అది వచ్చే ఏడాదే పట్టాలెక్కడం ఖాయమైంది. కల్కీ 2 పట్టాలెక్కే ముహుర్తం ఫిక్స్ అయ్యింది. మొత్తంగా వచ్చే ఏడాది ఏకంగా రెండు సినిమాలు రిలీజ్ కాబోతుంటే, మూడు మూవీలు పట్టాలెక్కబోతున్నాయి… మొత్తంగా 3 వేల కోట్ల కొత్త నిర్ణయాలు… 2 వేల కోట్ల పాత అద్భుతాలు… కలిపితే 5 వేల కోట్ల సినీ సునామీలు…
ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాలు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది… ఫ్యాన్స్ లో పూనకాలు రావటం ఖాయం. అలా 2025 లో సీజన్ కోసారి ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చేలా ఉన్నాయి. 2025 ప్రభాస్ కెరీర్ లోనే కాదు, తన ఫ్యాన్స్ లో కూడా మరిచిపోలేని ఏడాదిగామారబోతోంది. 5 వేల కోట్ల రెబల్ స్టార్ జర్నీకి వచ్చే ఏడాదే వేదిక కాబోతోంది. ఖాన్లు, కపూర్లు, కుమార్లు, మహా మహా సూపర్ స్టార్లు కూడా రెబల్ స్టార్ క్రియేట్ చేయబోయే సూపర్ నోవాకి కొట్టుకుపోతారేమో అనేంత సీన్ క్రియేట్ అవుతోంది
మరీ అతిశయోక్తిలా చెప్పటం కాదు కాని, ప్రభాస్ నిర్ణయాలు, సాహసాలు ఊహాతీతంగా జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ సలార్, ఈఏడాది కల్కీ తో ఏడాదికో వెయ్యికోట్ల పండ తెచ్చేలా ఉన్నాడు ప్రభాస్ అనేది తోటి హీరోల బాధ… అలాంటిది ఒకే ఏడాది రెండు సార్లు వెయ్యికోట్లు రాబడితే, ఒకే ఏడాది మూడు పాన్ ఇండియా మూవీలను మొదలు పెడితే… ఇది నిజంగా ఇండియన్ సినిమాకి ఎనిమిదో వింతలాంటి న్యూసే..
కాని అదే నిజమౌతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాకింగ్ నిర్ణయం తీసుకుంటే, దర్శకులు అంతకంటే వేగం పెంచి, రెబల్ స్టార్ ఇచ్చిన అవకాశాన్ని వాడేసుకుంటున్నారు. 2025 సమ్మర్ లో స్పిరిట్ మూవీ మొదలు కాబోతోంది. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే స్పిరిట్ మొదలవ్వాలంటే, ముందు రెబల్ స్టార్ కమిటైన మూవీలు పూర్తి చేయాలి…అలానే స్పిరిట్ షూటింగ్ చేసేప్పుడు మరో మూవీ చేయకూడదు. ఇది రెబల్ స్టార్ ప్రభాస్ కి సందీప్ రెడ్డి పెట్టిన కండీషన్
ఈ కండీషనే చాలా విషయాలు అఫీషియల్ గా లీకవ్వటానికి, లేదంటే జనమే గెస్ చేయటానికి కారణమైంది. స్పిరిట్ షూటింగ్ సమ్మర్ లో మొదలౌతుందంటే, మార్చ్ నుంచి మేలోపు ఎప్పుడైనా షూటింగ్ మొదలవ్వొచ్చు.. స్పిరిట్ షూటింగ్ మొదలైతే, ప్రభాస్ మరే మూవీ చేయకూడదు. అంటే తను చేస్తున్న ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు మేలోగానే షూటింగ్ పూర్తి చేసుకుంటాయనేది ఇండైరెక్ట్ గా అర్ధమౌతున్న విషయం
ఎలాగూ ది రాజా సాబ్ రిలీజ్ ఏప్రిల్ లోనే అన్నారు కాబట్టి, ది రాజా సాబ్ షూటింగ్ డిసెంబర్ లోగా పూర్తవుతుందని తెలుస్తోంది. ఎటొచ్చి హను రాఘవపూడీ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ మాత్రం ఎప్పుడు రిలీజో తెలలేదు. కాకపోతే షూటింగ్ మాత్రం మే లోగా పూర్తవుతుందని తెలిసిపోతోంది.ఐతే దసరాకు ఫౌజీ రిలీజ్ అవ్వొచ్చని మాత్రం ప్రచారం జరుగుతోంది. సో 2025 లో రెండు పాన్ ఇండియా సినిమాలతో వేల కోట్లు రాబడితే, ఇక పాన్ ఇండియా బాక్సాఫీస్ తట్టుకోవటం కష్టం..
ఇదే కాదు 750 కోట్లు రాబట్టిన సలార్ కి సీక్వెల్ సలార్ 2 ని దీపావళికి లాంచ్ చేసేలా ఉన్నారు. కల్కీ 2 కూడా దీపావళి లేదంటే క్రిస్మస్ కి లాంచ్ అవ్వొచ్చు. అంటే ఒకే ఏడాది మీద రెండు సినిమాలతో దాడి చేయాలనుకుంటున్న ప్రభాస్, అదే ఏడాదిలో స్పిరిట్, సలార్ 2, కల్కీ 2 తో మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నట్టే… అదే జరిగితే బాక్సాఫీస్ బద్దలే… ఏ హీరోలో లేని వేగం ప్రభాస్ లో కనిపిస్తోంది. బాక్సాఫీస్ తో బాక్సింగ్ తర్వాత ఆ బాక్సాఫీస్ కోలుకునేలోపే మరోపాన్ ఇండియా మూవీతో దాడి చేస్తున్నాడు రెబల్ స్టార్.