Prabhas: ప్రభాస్ పెళ్లి తిరుపతి ఓకే.. కాని ఎప్పుడు.? ఎవరితో..?

ఆదిపురుష్ ప్రమోషన్ లో భాగంగా తన పెళ్లి తిరుపతిలోనే అని తేల్చాడు ప్రభాస్. అది విన్న ఫ్యాన్స్ కి సంతోషంతో పాటు డౌట్లు కూడా పెరిగాయి. ఎందుకంటే 43 ఏళ్ల ప్రభాస్ తన పెళ్లి తిరుపతిలోనే అన్నాడు కాని, ఎప్పుడో? ఎవరితోనో తేల్చలేదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఇలానే తన పెళ్లంటే అప్పుడు, ఇప్పుడు అంటూ 57 ఏళ్ల వయసొచ్చే వరకు మాటలు చెప్పాడు.. ఇప్పుడు మాటలే మిగిలాయి.

ఇలానే ప్రభాస్ కూడా మాటలతో వయసుని నెట్టుకొచ్చేలా ఉన్నాడా? ఇంకెప్పుడు తన పెళ్ళౌతుంది.. తన పెళ్లి తన ఇష్టం కావొచ్చు. కాని ఫ్యాన్స్ లో మాత్రం తమ అభిమాన హీరోకి పెళ్లి ఎప్పుడవుతుందనే డిస్కర్షన్ ఎప్పటినుంచో ఉంది. తనకి వారసుడో, వారసురాలో పుట్టాలని, ఇలా చాలా డిస్కర్షన్స్ జరిగిపోతున్నాయి.. చెర్రీకి ఎప్పుడు జూనియర్ మెగా పవర్ స్టార్ పుడతాడో అని మెగాఫ్యాన్స్ వేయిటింగ్ అక్కడ.

ఇది స్టార్స్ వ్యక్తి గత విషయే అయినా, ఫ్యాన్స్ లో అలా ఉండదు.. ప్రభాస్ అనవసరంగా తన పెళ్లి తిరుపతిలోనే అని, మ్యారేజ్ టాపిక్ టచ్ చేశాడు. సో వెన్యూ తేలిపోయింది. ఇక పెళ్లికూతురెవరు? ముహుర్తం ఎన్నడూ అనే చర్చతో తేనె తుట్టని తట్టినట్టైంది.