Prabhas: నారి + నారి + నారి.. నడుమ ప్రభాస్ మురారి..

ప్రభాస్ తో మారుతి తీస్తున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లనే విషయం అందరికి తెలిసిందే.. ఐతే ఆ ముగ్గురు నారీ మనులు ఇందులో ప్రభాస్ కి ప్రియురాలిగానే కాదు, విలన్లుగా కూడా నటిస్తున్నారట. అంటే తన ప్రేయసిగా కనిపిస్తూనే విలనీ వేషాలేసే నెగెటీవ్ పాత్రలు కాదు..

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 04:12 PM IST

ఒక జన్మలో హీరోకి శత్రువులైన ముగ్గురు ఈ జన్మలో అమ్మాయిలుగా పుట్టి, హీరోని ప్రేమలో పడేసి, వాళ్ల బుర్ర తక్కువ తనంతో హీరోని ఇబ్బందులు పెడతారట. ఇదేదో అ అ మూవీలో విలన్ విసిరిన డైలాగ్ లా ఉంది.. శత్రువులు ఎక్కడో ఉండరు చెల్లిళ్లు కూతుర్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతారు.

ఈ డైలాగ్ లో లాజిక్ లానే, మారుతి మూవీలో ప్రభాస్ ముగ్గురు ప్రేయసిమనులు, గత జన్మలో తన శత్రువులని తెలుస్తోంది. ఈ లైనే తనకి నచ్చి మారుతి మూవీ చేస్తున్నాడట ప్రభాస్. అంతేకాదు తాత ఆత్మ రాజా డీలక్స్ థియేటర్ స్క్రీన్ మీద హీరోకి అవసరమైనప్పుడల్లా కనిపిస్తుందట. హీరోకి సాయం చేస్తుందట.. ఐతే ఇక్కడ మేయిన్ విలన్ మాత్రం హీరో మొదటి జన్మలో తన భార్య అని, ఈ జన్మలో విలన్ గా ముఖ్యంగా మగాడిగా పుట్టి రివేంజ్ తీర్చుకుంటుందని తెలుస్తోంది. మొత్తానికి కాన్సెప్ట్ కామెడీ జోనర్ కి తగ్గట్టుగానే కొత్తగా ఉంది.. కాని మారుతీ అసిస్టెంట్ల పుణ్యమాని బయటికి లీకులు పెరిగాయి.