PRABHAS: ఆ సినిమాలతో ప్రభాస్‌ రిస్క్ చేస్తున్నాడా..? పంచ్ పడుతుందా..?

ఒక్క బాహుబలి ఒక్క బాహుబలి సిరీస్ వదిలేస్తే.. మాస్ మూవీలు, మాస్ కామెడీలు, రొమాంటిక్ యాక్షన్ కహానీలే ప్రభాస్‌కు కలిసొచ్చాయి. అదే ఫస్ట్ టైం రాముడిగా మారితే ఆదిపురుష్‌తో పంచ్ పడింది. పామ్ రీడర్ అంటూ రాధేశ్యామ్ చేస్తే ఫ్లాప్ ఫేస్ చేయాల్సి వచ్చింది.

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 07:14 PM IST

PRABHAS: స్పిరిట్ మూవీలో మొదటి సారి రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఎప్పుడో ఏక్ నిరంజన్‌లో బౌంటీ హంటర్‌గా కనిపించినా అది పోలీస్ పాత్ర అనలేం. సో.. ఇదే తనకి ఫస్ట్ పోలీస్ మూవీ. బేసిగ్గానే ప్రభాస్‌కి కొత్త జోనర్లో ప్రయోగాలు చేయటం ఇష్టం. అందుకే జోనర్స్ మారుస్తూ సాహసాలు చేస్తున్నాడు. కానీ, తను ఎప్పుడూ టచ్ చేయని జోనర్‌లోకి వెల్లిన ప్రతీసారి పంచ్ పడుతూనే ఉంది. ఒక్క బాహుబలి ఒక్క బాహుబలి సిరీస్ వదిలేస్తే.. మాస్ మూవీలు, మాస్ కామెడీలు, రొమాంటిక్ యాక్షన్ కహానీలే ప్రభాస్‌కు కలిసొచ్చాయి.

GUNTUR KAARAM: గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్‌ గెస్టుగా పవన్..?

అదే ఫస్ట్ టైం రాముడిగా మారితే ఆదిపురుష్‌తో పంచ్ పడింది. పామ్ రీడర్ అంటూ రాధేశ్యామ్ చేస్తే ఫ్లాప్ ఫేస్ చేయాల్సి వచ్చింది. చక్రం, పౌర్ణమి అంటూ ఇలానే కదిలించే ప్రయోగాలు చేస్తే డిజాస్టర్లు ఎదురయ్యాయి. అందుకే మారుతి మేకింగ్‌లో చేస్తున్న హర్రర్ మూవీ రాజా డీలక్స్ మీద అనుమానాలు పెరిగాయి. అసలే మారుతి ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేస్తాడా అనే డౌటుంది. ఇంతవరకెన్నడు చేయని జోనర్‌లో మొదటి సారి ప్రభాస్ కనిపిస్తే కిస్మత్ కలిసిరాదని తేలింది.

మరి ఈ హర్రర్ మూవీ, స్పిరిట్ అంటూ చేసే కాప్ మూవీ ప్రభాస్‌కి సెంటిమెంట్‌లానే పంచ్ ఇస్తాయా? బాహుబలిలా కొత్త రూట్లో వసూళ్ల బీట్ పెంచుతాయా? తేలాలంటే మే 9న వచ్చే కల్కి నుంచి దసరాకొచ్చే రాజా డీలక్స్ వరకు వేయిట్ చేయాల్సిందే.