PRABHAS: డార్లింగ్‌ ఔట్‌ ఆఫ్‌ స్టేషన్‌.. ప్రభాస్‌ ఎందుకు ఓటెయ్యలేదో తెలుసా..?

మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు లాంటి స్టార్స్‌ కూడా ఉదయాన్ని ఓటు వేశారు. కానీ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాత్రం తన ఓటుహక్కు వినియోగించుకోనట్టు తెలుస్తోంది. తన ఓట్‌ ఉన్న పోలింగ్‌ బూత్‌కు ప్రభాస్‌ ఇప్పటి వరకూ రాలేదు.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 05:32 PM IST

PRABHAS: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకూ చాలా స్లోగా జరిగిన పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. గంట వ్యవధిలోనే దాదాపు 15 శాతం పోలింగ్‌ పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 37 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదవ్వగా.. మధ్యాహ్నం 3 వరకూ 52 శాతానికి చేరింది. ఈ పర్సంటేజి క్రమంగా కొనసాగుతోంది. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్లకు కేటాయించిన పోలింగ్‌ బూత్‌లలో కుటుంబంతో కలిసి ఓటు వేశారు.

ASSEMBLY ELECTIONS: కదిలొస్తున్న ఓటర్లు.. మెరుగవుతున్న ఓటింగ్.. 52 శాతం నమోదు..

మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు లాంటి స్టార్స్‌ కూడా ఉదయాన్ని ఓటు వేశారు. కానీ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాత్రం తన ఓటుహక్కు వినియోగించుకోనట్టు తెలుస్తోంది. తన ఓట్‌ ఉన్న పోలింగ్‌ బూత్‌కు ప్రభాస్‌ ఇప్పటి వరకూ రాలేదు. దీంతో డార్లింగ్‌ ఎందుకు రాలేదా అనుకుంటున్నారు ఫ్యాన్స్‌. అయితే ప్రభాస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో లేడని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న ప్రాజెక్ట్‌ల కారణంగా డార్లింగ్‌ అవుట్‌ ఆఫ్‌ స్టేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఓటు వేసేందుకు ప్రభాస్‌ రాలేదని చెప్తున్నారు. సాధారణంగా ప్రభాస్‌ పెద్దగా బయటకు రాడు. ఎంతో ఇంపార్టెంట్‌ ఫంక్షన్‌ అయితే తప్ప అటెండ్‌ అవ్వడు. కానీ ఓటుహక్కును మాత్రం ప్రతీ సంవత్సరం వినియోగించుకుంటాడు.

కానీ ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్‌లు నడుస్తున్న కారణంగా ప్రభాస్‌కు ఓటు వెయ్యడం కుదరలేదట. ఈ కారణంగానే హైదరాబాద్‌కు రాలేకపోయాడట ప్రభాస్‌. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో సలార్‌, నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్‌. సలార్‌ షూటింగ్‌ ఆల్మోస్ట్‌ పూర్తయ్యింది. కల్కి ఆన్‌ గోయింగ్‌ ప్రాసెస్‌లో ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న కారణంగానే ప్రభాస్‌ ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తోంది.