రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియ వైడ్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కల్కీ వసూళ్ల తో మరోసారి కూడా పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టారే అని ప్రూవ్ అయ్యింది. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా ఐదు సార్లు ఐదు పాన్ ఇండియా హిట్స్ తో దేశం మొత్తానికి నెంబర్ వన్ హీరో తనే అనిపించుకున్నాడు. ఇదే అసాధ్యం అనుకున్న ఫీట్ అనుకుంటే, అమెరికాలో, నెంబర్ 1 మాత్రమే కాదు అమెరికాలో నెంబర్ 2 కూడా ప్రభాసే అని తేలింది… అదే విచిత్రం
నిజంగా ప్రభాస్ లా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ని షేక్ చేసే ఛాన్స్ ఎవరికీ రాలేదు. దంగల్ 2 వేల కోట్లు రాబట్టినా, ఇది హిందీ వరకే పరిమితం, తమిల్, తెలుగులో కొంతవరకు బానే ఆడింది. చైనాలో వసూళ్ల వరదొచ్చింది. అలా ఏదో ఒక ఏరియాలో దంగల్ దూసుకెళ్లింది. షారుక్, పటాన్, జవాన్ కూడా హిందీలోనే వెయ్యికోట్లు రాబట్టి, హిట్ మెట్టెక్కాయి.
కాని ప్రభాస్ విషయానికొస్తే, దేశం మొత్తం బాహుబలి1, బాహుబలి 2 సినిమాలు ఊపేశాయి. సాహో, సలార్ , కల్కీ ఇవి కూడా 500 కోట్లు, 750 కోట్లు, 1200కోట్లతో ట్రెండ్ సెట్ చేశాయి. ఓవరాల్ గా ఒక సినిమా కోసం సౌత్, నార్త్ ఇండియన్స్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అందరూ, విదేశాల్లో ఉన్న భారతీయుడు వేయిట్ చేశారంటే అది ప్రభాస్ మూవీస్ కోసమే.. ఈ హిస్టరీ క్రియేట్ కావటానికి కారణం ఓరకంగా రాజమౌళి కూడా….
ఏదేమైనా ప్రభాస్ ఇంతవరకు ఇండియాలోనే నెంబర్ వన్ అనిపించుకున్నాడు. కాని యూఎస్ లో నెం1. నెంబర్ 2 అనిపించుకోవటానికి కారణం, కల్కీ వసూళ్లు 19 మిలియన్ల దగ్గర అగిపోవటం… మరో నెలరోజులు ఈ సినిమా అక్కడ ఆడితే 20 మిలియన్లలో చేరేది. అదే జరిగితే అమెరికాలో 20 మిలియన్లు రాబట్టిన ఇండియన్ మూవీస్ గా బాహుబలి2, కల్కీ రికార్డుల్లో ఉండేవి. కాని బాహుబలి 2 మూవీ 20. 5 మిలియన్ల వసూళ్లు దాటి,అమెరికాలో భారీ వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా నెంబర్ వన్ ప్లేస్ లోఉంది. ఆ రికార్డు బ్రేక్ చేస్తుందనుకున్న కల్కీ మూవీ సందడి యూఎస్ లో బ్రేక్ పడింది. డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ కి భారీగా ఆడుతుండటంతో, అక్కడ వాటికి స్క్రీన్లు పెంచేసరికి, యూఎస్ లో కల్కీ జర్నీ నైంటీ పర్జెంట్ పూర్తైనట్టే కనిపిస్తోంది. ఏదేమైనా అమెరికాలో భారీగా వసూల్లు రాబట్టిన ఇండియన్ సినిమాల్లో టాప్ వన్ బాహుబలి 2, టాప్ 2 కల్కీ… అంటే అక్కడ నెంబర్ వన్, నెంబర్ 2 రెండూ కూడా రెబల్ స్టారే అని తేలింది.