400 కోట్ల రాజా సాబ్ కి ముగ్గురు… 1000 కోట్ల పోలీస్ సాబ్ కి ఇద్దరు..

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ గా రాబోతున్నాడు. 400 కోట్ల బడ్జెట్ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. ఇందులో తనకి ముగ్గురు హీరోయిన్లు ఉంటారంటే రొమాంటిక్ కిక్ ఇచ్చే మూవీ అనుకున్నారు. కాని ఇది హర్రర్ మూవీ అని తేలింది. కట్ చేస్తే స్పిరిట్ లో మాత్రం ఇద్దరు హీరోయిన్లని తేలింది.

  • Written By:
  • Publish Date - December 17, 2024 / 02:59 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ గా రాబోతున్నాడు. 400 కోట్ల బడ్జెట్ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. ఇందులో తనకి ముగ్గురు హీరోయిన్లు ఉంటారంటే రొమాంటిక్ కిక్ ఇచ్చే మూవీ అనుకున్నారు. కాని ఇది హర్రర్ మూవీ అని తేలింది. కట్ చేస్తే స్పిరిట్ లో మాత్రం ఇద్దరు హీరోయిన్లని తేలింది. అందులో ఒకరు కన్ఫామ్ అయ్యారు. మరొకరి ప్లేస్ లోనే లేడీ సూపర్ స్టార్ పేరు వినిపిస్తోంది. హాలీవుడ్ లేడీ పేరు కూడా ప్రస్థావనలోకి వచ్చింది. మొత్తంగా తన సినిమా అంటే ఎగిరి గంతేసి ఒప్పుుకునే హీరోయిన్ల వేట పూర్తైంది. స్పిరిట్ స్క్రిప్ట్ తో పాటు మ్యూజిక్ సెట్టింగ్స్ మాత్రమే కాదు, స్టార్ కాస్ట్ కూడా పూర్తైంది. కొరియా విలన్ సీన్ తో పాటు హీరోయిన్లు కూడా ఫిక్స్ అయ్యాక ఇంకా దేని కోసం వేయిటింగ్… రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కూడా స్పిరిట్ సినిమాకొచ్చిన అడ్డేంటి?

రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ లో ముగ్గరు హీరోయిన్లను తీసుకుంటే, స్పిరిట్ లో ప్రభాస్ కోసం ఇద్దరిని రంగంలోకి దింపుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ కొరియన్ విలన్ మడాంగ్ ని విలన్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగ, ఇందులో హీరోయిన్స్ గా ఇద్దరిని కన్ఫామ్ చేశాడట. అందులో ఒకరు నయనతార అని తెలుస్తోంది

నిజానికి స్పిరిట్ లో ప్రభాస్ మల్టిపుల్ రోల్ వేస్తున్నాడని, ఆ పాత్రల కోసమే ఇద్దరు హీరోయిన్లు అంటున్నారు. ఒకరు నయనతారే అని ప్రచారం జరగటానికి కారణం, నవంబర్ చివరి వారంలో తనని సందీప్ కలిశాడన్న వార్త కాస్త లేటుగా ఈ నెల్లో రివీల్ అవటం.. యోగిలో కలిసి చిందేసిన ఈ బ్యాచ్ మరోసారి కలిసి నటిస్తుందా అన్నది అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లోనే తెలుస్తుంది

కాకపోతే అది మాత్రం లాంచనమే కాని, ఆల్ మోస్ట్ అంతా కన్ఫామ్ అనంటున్నారు. ఇక రెండో పాత్రలో కైరా అద్వాని అంటూ ప్రచారం అయితే జరిగింది. కాని రెండో పాత్ర కోసం హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రానే అప్రోచ్ అయ్యాడు సందీప్. ఆల్ మోస్ట్ తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది

ఆల్రెడీ స్పిరిట్ కథ సిద్దమైంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. విలన్ గా మాడాంగ్ ని కూడా సందీప్ ఫిక్స్ చేశాడు. ప్రీ ప్రొడక్షన పనులు, లొకేషన్ల హంటింగ్ అంతా పూర్తైంది.. సో ఇక షూటింగ్ మొదలు పెట్టడమే తరువాయి..అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ మరే సినిమా చేయకూడదు, తన లుక్ రివీల్ చేయకూడదు… ఇది సందీప్ రెడ్డి కండీషన్.. అందుకే ఫౌజీని జూన్ లోగా పూర్తి చేసి, ఆగస్ట్ నుంచి పూర్తిగా స్పిరిట్ కోసమే డెడికేట్ చేయబోతున్నాడు ప్రభాస్…

నిజానికి బాహుబలి, సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కీ ఇలా ఎందులోచూసినా ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు కామన్ గా నే కనిపించారు. ఇప్పుడు స్పిరిట్ వంతొచ్చింది… ఇందులో మల్టిపుల్ రోల్స్ వేస్తున్న తనకోసం ఇద్దరిని ఫిక్స్ చేస్తే, ఆ ఇద్దరూ సీనియర్ హీరోయిన్లే అవటం విచిత్రంగా ఉందంటున్నారు. ప్రియాంక చోప్రా, నయనతార ఇద్దరూ ఫార్టీ ప్లస్ లేడీస్ నే స్పిరిట్ కోసం కన్ఫామ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.