ఇప్పుడు ఇండియాలో బాలీవుడ్ మాట కంటే ప్రభాస్ మాట ఎక్కువగా వినపడుతోంది. ప్రభాస్ సినిమా విడుదల అవుతుంది అంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంటే సినిమా ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. కల్కీ మీద అంచనాలు ఉన్నాయి గాని ఆ రేంజ్ లో కల్కీ సినిమా హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కాని కల్కీ సినిమా బాలీవుడ్ ని షేక్ చేసింది. అక్కడి హీరోలకు కొత్త టార్గెట్ పెట్టింది. దీనితో ఇప్పుడు బాలీవుడ్ ప్రభాస్ ని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక నానా కష్టాలు పడుతుంది. అక్కడ హీరోలు చాలా మంది ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
బాలీవుడ్ లో ఖాన్ త్రయం నుంచి ఎప్పుడో ఒక సినిమా వస్తోంది. ఇతర హీరోలు ఉన్నా సరే ఎప్పుడు సినిమా విడుదల చేస్తారో తెలియదు, వారికి అంత క్రేజ్ లేదు. కాని ఇప్పుడు అక్కడ వస్తున్న గ్యాప్ ని ప్రభాస్ ఫిల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వెంట వెంటనే బాలీవుడ్ లో సినిమాలు విడుదల చేసి హిట్ లు కొడితే అక్కడి హీరోల సినిమాల కంటే తన సినిమాల కోసం సినిమా జనాలు ఎదురు చూస్తారని ప్రభాస్ ఎదురు చూస్తున్నాడు. అందుకే అసలు ఒక సినిమా పూర్తి కాగానే మరో సినిమా మీద ఫోకస్ పెట్టేస్తున్నాడు.
స్పిరిట్, రాజా సాబ్ విషయంలో ప్రభాస్ భారీ ప్లాన్ తోనే ఉన్నాడు. పంజాబీ మార్కెట్ మీద కూడా ఫోకస్ పెట్టాడు. పంజాబ్ లో హిందీ సినిమాలకు అంతగా ఆదరణ ఉండదు. అక్షయ్ కుమార్… పంజాబ్ లో ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేసినా ఇప్పుడు హిట్ ల కోసం ఎదురు చూస్తున్నాడు. 11 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి వరుసగా. అందుకే ఈ గ్యాప్ ని ఫిల్ చేసి.. పంజాబ్ లో కూడా క్రేజ్ పెంచుకోవాలని భావిస్తున్నాడు. యానిమల్ సినిమాతో సిఖ్ మార్కెట్ పై రణబీర్ దృష్టి పెట్టినా… అది ఎంత వరకో చెప్పలేం. ఇప్పుడు ప్రభాస్ మాత్రం… హిందీ మార్కెట్ తో పాటుగా పంజాబీ మార్కెట్ పై కూడా ఫోకస్ పెట్టడం బాలీవుడ్ ని భయపెడుతోంది.