Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్‌ని రాముడిగా చూశాం. రాధేశ్యామ్‌లో కృష్ణుడి అంశగా చూశాం. త్వరలో కల్కి అవతారంలో కూడా చూస్తామని ప్రాజెక్ట్ కే అలియాస్ కల్కీ 2898 గ్లింప్స్ తేల్చింది. ఇక ఇప్పుడు కొత్తగా తేలిందేంటంటే, ప్రభాస్ కర్ణుడి అవతారమెత్తబోతున్నాడు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్‌కే ఇలాంటి అవకాశం చిక్కింది.
రాముడైనా, కృష్ణుడైనా, కర్ణుడైనా ఏదైనా తనే అనేంతగా పాత్రల్లో పాతుకుపోయాడు. అలాంటి పాత్రలకు ప్రాణం పోశాడు. ఇప్పుడు ఈ సీజన్‌లో రాముడు, కృష్ణుడు, కర్ణుడంటూ పురాణ పురుషుడిగా మారే అదృష్టం ప్రభాస్ ఒక్కడికే దక్కేలా ఉంది. సీతారామం సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన హను రాఘవపూడి, ప్రభాస్‌తో భారీ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడు. కర్ణుడి పాత్ర ప్రేరణతో పాత్రని, కథని రెడీ చేశాడట. ఈ ఏడాది ఎండింగ్‌లో ఈ సినిమా సెట్స్ పైకెళుతుందట. అంతా బానే ఉంది కాని యానిమల్ మూవీ తీస్తున్న సందీప్ రెడ్డి వంగా, ఆ హిందీ సినిమా తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ తీయాలి.
ఎనౌన్స్ కూడా చేశాడు. మరి అదేమౌతుందంటే.. సందీప్ మూవీ, హను రాఘవ పూడి మూవీ రెండూ సమాంతరంగా చేస్తాడట ప్రభాస్. అప్పటి వరకు సలార్ 2కు, ప్రాజెక్ట్ కే-2 షూటింగులకు ఛాన్స్ లేదని తెలుస్తోంది.