Prabhas Project K: ప్రాజెక్ట్‌ K రిలీజ్‌ పోస్టర్‌లో హింట్‌లు.. మూవీ కాన్సెప్ట్ క్లియర్‌గా చెప్పేశారా ?

పోస్టర్లతోనే కావాల్సినంత క్రేజ్ వచ్చేసింది సినిమాకు ! ఆహానే ఆహా అనిపించిన క్రేజ్‌ ప్రభాస్ సొంతం.. ఇక సినిమా అంటే మాటలా ! సంక్రాంతికి మరో ఏడాది ఉన్నా.. ప్రాజెక్ట్ కే బజ్ మాత్రం ఇప్పటి నుంచే కనిపిస్తోంది

  • Written By:
  • Publish Date - February 20, 2023 / 05:09 PM IST

ప్రభాస్‌ చేతుల్లో చాలా సినిమాలు ఉన్నాయ్. ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్ K, మారుతితో మూవీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయ్ లిస్టులో! రాబోయే సినిమాలు భారీగానే ఉన్నా.. వస్తున్న అప్‌డేట్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయ్. ఇలాంటి టైమ్‌లో ప్రాజెక్ట్‌ కే మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి లాక్ చేశాం.. రిలీజ్‌కు సిద్ధం అంటూ కనిపిస్తున్న పోస్టర్‌.. ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. ప్రాజెక్ట్ కే కోసం.. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఫీల్‌గుడ్‌ సినిమాల దర్శకుడు నాగ్‌అశ్విన్‌.. ప్యాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావటంతో అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయ్.

ప్రాజెక్ట్‌ కే నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదు పోస్టర్లు రిలీజ్ అయ్యాయ్. అందులో సగానికి పైగా చెయ్యికి సంబంధించినవే ! ఇప్పుడు రిలీజ్ పోస్టర్‌లోనూ చెయ్యి ఉంది. దీంతో సినిమా కాన్సెప్ట్ ఏంటా అనే చర్చ మొదలైంది. అప్పుడెప్పుడో చక్రం వీడియోను టీమ్ రిలీజ్‌ చేస్తే.. టైమ్ ట్రావెల్ స్టోరీ అనున్నారు అంతా ! ఐతే ఆ తర్వాత విడుదలయిన పోస్టర్లతో.. సరికొత్త ప్రచారం మొదలైంది. లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్టల్ అంటూ ఆ మధ్య ఓ హ్యాండ్‌ ఫొటో బయటపెట్టారు. దీంతో సైన్స్‌కు దేవుడికి లింక్ ఏంటి అనే కాన్సెప్ట్‌తో సినిమా అనుకున్నారు. దానికి తగినట్లు.. నెల్లూరు జిల్లాలోని ఓ గుడిలో షూటింగ్ జరగడం.. ఆ అనుమాన్ని మరింత స్ట్రాంగ్‌గా చేసింది. ఇప్పుడు రిలీజ్ పోస్టర్‌లో.. పెద్ద చేయి ఒకటి కనిపంచడం.. ముగ్గురు వ్యక్తులు స్పేస్‌ సూట్‌లాంటి బట్టల్లో గన్‌ ఎయిమ్ చేస్తూ కనిపించడం.. ఇంకో చర్చకు కారణం అవుతోంది. ఏలియన్స్‌కు సంబంధించిన స్టోరీనా.. వేరేగ్రహం నుంచి భూమి మీదకు ఎవరైనా వచ్చి బీభత్సం సృష్టిస్తే.. హీరో అడ్డుకునే కథనా అంటూ.. చర్చ మొదలైంది.

ఏమైనా.. పోస్టర్లతోనే కావాల్సినంత క్రేజ్ వచ్చేసింది సినిమాకు ! ఆహానే ఆహా అనిపించిన క్రేజ్‌ ప్రభాస్ సొంతం.. ఇక సినిమా అంటే మాటలా ! సంక్రాంతికి మరో ఏడాది ఉన్నా.. ప్రాజెక్ట్ కే బజ్ మాత్రం ఇప్పటి నుంచే కనిపిస్తోంది.