ప్రభాస్ రెబల్ ఆన్సర్ కు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కు పిచ్చి లేచింది

సౌత్ ఇండియన్ హీరోల విషయంలో బాలీవుడ్ కొంచెం బలుపు చూపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు సౌత్ ఇండియన్ హీరోలను సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చూసేది బాలీవుడ్. ఇప్పుడు మాత్రం ఆ బలుపు కాస్త తగ్గింది.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 12:19 PM IST

సౌత్ ఇండియన్ హీరోల విషయంలో బాలీవుడ్ కొంచెం బలుపు చూపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు సౌత్ ఇండియన్ హీరోలను సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చూసేది బాలీవుడ్. ఇప్పుడు మాత్రం ఆ బలుపు కాస్త తగ్గింది. అసలు హైదరాబాద్ రావడానికి కూడా ఇష్టపడని చాలామంది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇప్పుడు హైదరాబాదులో ఇల్లు కూడా కొన్ని ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకప్పుడు ముంబైని సినిమాలకు రాజధానిగా బిల్డప్ ఇచ్చిన బాలీవుడ్ జనాలు ఇప్పుడు మాత్రం బుద్ధి తెచ్చుకున్నారు.

దీనికి కారణం కచ్చితంగా బాహుబలి సినిమా. రెండు పార్టులతో ప్రభాస్ ఒక రకంగా బాలీవుడ్ పీకపై కత్తి పెట్టాడు. ఆ కత్తి నిదానంగా తెగుతూ ఇప్పుడు పుష్ప సినిమాతో ఆ గాయం మరింత పెద్దదయింది. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సౌత్ హీరోలను బీట్ చేయడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలను ఎదుర్కోవాలంటే బాలీవుడ్ హీరోలకు మల్టీస్టారర్ సినిమా చేసిన అది పెద్దగా ప్రభావం చూపించే ఛాన్స్ కనబడటం లేదు. దీనితో ఇప్పుడు ప్రభాస్ వెంట పడుతున్నారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ తో హైదరాబాద్ లో స్టార్ ప్రొడ్యూసర్ ప్రభాస్ ని కలిశాడు.

ప్రస్తుతం సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ మోడ్ లో ఉన్న ప్రభాస్ ను సదరు ప్రొడ్యూసర్ కలిసి ఒక కథను కూడా చెప్పించే ప్రయత్నం చేశాడు. గతంలో ఆదిపురుష్ విషయంలో తన పరువు బాలీవుడ్ తీసింది అనే కోపం ప్రభాస్ లో పీకల వరకు ఉంది. దీనితో ఆ సినిమా చేసేది లేదని మొహం మీదే చెప్పేసాడు. ప్రభాస్ కథ కూడా వినలేదట. దీనికోసం వేరే వాళ్ళతో రికమండేషన్ చేయించిన సరే ప్రభాస్ మాత్రం కథ వినడానికి అసలు ఇష్టపడలేదు. ఆదిపురుష్ సినిమా కారణంగా తాను కొన్నాళ్లు మెంటల్ గా ఇబ్బంది పడ్డానని కాబట్టి బాలీవుడ్ డైరెక్టర్లతో గాని ప్రొడ్యూసర్లతో కానీ సినిమా చేసే ఛాన్స్ లేదని ఒక రకమైన ఆటిట్యూడ్ చూపించాడట ప్రభాస్.

తనకు తెలుగు డైరెక్టర్లు అలాగే సౌత్ ఇండియన్ డైరెక్టర్ల తో భారీ ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయని కాబట్టి తాను ఇప్పుడు కథ వినే పొజిషన్లో కూడా లేనంటూ సదరు ప్రొడ్యూసర్ కు క్లియర్ కట్ గా అర్థమయ్యేలా ముఖం మీద చెప్పేశాడట రెబల్ స్టార్. దీనితో అదే కథను మరో స్టార్ హీరోకు వినిపించడానికి రెడీ అయ్యాడు బాలీవుడ్ ప్రొడ్యూసర్. ప్రభాస్ ప్రస్తుతం 8 సినిమాలను లైన్లో పెట్టి దాదాపు మూడేళ్ల పాటు వేరే డైరెక్టర్ కు గాని ప్రొడ్యూసర్ కు గాని చాన్స్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు రిలీజ్ అయితే ప్రభాస్ రేంజ్ ఎవరికి అందని ఎత్తులో ఉండే ఛాన్స్ ఉంది.