PRABHAS: రూ.300 కోట్ల ప్రభాస్.. తగ్గేదిలేదు..

సందీప్ రెడ్డి మేకింగ్‌లో ప్రభాస్ చేయబోయే స్పిరిట్‌కి తన రెమ్యునరేషన్ ఎంతో క్లారిటీ వచ్చింది. అలాగని రూ.150 కోట్ల కంటే ఎక్కువ తీసుకుంటున్నాడా అంటే అదీ లేదు. సందీప్ స్పిరిట్‌కి ప్రభాస్ అందుకునేది రూ.150 కోట్లు ఎమౌంటే.

  • Written By:
  • Updated On - December 27, 2023 / 08:21 PM IST

PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలికి రూ.75 కోట్లు తీసుకున్నాడు. సాహోకి రూ.100 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నాడు. తర్వాత ఆదిపురుష్‌కి రూ.150 కోట్లు, సలార్, కల్కి మూవీలకు రూ.150 కోట్లు తీసుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు ఏకంగా రూ.300 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడనేది రూమర్ కాదు.. నిజమని తేలింది. కారణం సందీప్ రెడ్డి మేకింగ్‌లో ప్రభాస్ చేయబోయే స్పిరిట్‌కి తన రెమ్యునరేషన్ ఎంతో క్లారిటీ వచ్చింది.

PRABHAS: స్పిరిట్ విషయంలో మాట మార్చిన సందీప్ రెడ్డి

అలాగని రూ.150 కోట్ల కంటే ఎక్కువ తీసుకుంటున్నాడా అంటే అదీ లేదు. సందీప్ స్పిరిట్‌కి ప్రభాస్ అందుకునేది రూ.150 కోట్లు ఎమౌంటే. కాని రూ.300 కోట్లకు తన పారితోషికం పెరగలేదనేది అబద్దం కాదు. ఇదే విచిత్రం.. ముట్టుకోకుండా ముద్దుపెట్టడం అన్న ప్రశ్నలానే ప్రభాస్ పారితోషికం రూ.150 కోట్లే తీసుకుంటున్నా తన రెమ్యునరేషన్ 300 కోట్లకు చేరుతోంది. అక్కడే ట్విస్ట్ ఉంది. స్పిరిట్ మూవీకోసం టీ సీరీస్ సంస్థ ప్రభాస్‌కి రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తోంది. అలానే తెలుగు రాష్ట్రాల ఏరియా రైట్స్ కూడా తనకే రాసిచ్చేసింది. ప్రభాస్ మూవీలు ఈజీగా తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్ల కుపైనే రాబడతాయి.

కాబట్టే తక్కువలో తక్కువ స్పిరిట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్‌కి రూ.150కోట్లు అదనపు ఆదాయం దక్కే ఛాన్స్ ఉంది. దాన్ని తన రెమ్యూనరేషన్‌ని కలిపితే రూ.300 కోట్ల లెక్కతేలుతోంది. ఈరేంజ్‌లో పారితోషికం అందుకుంటున్న మొదటి ఇండియన్ హీరో అవటమే కాదు.. మొదటి ఏషియన్ కూడా ప్రభాసే.