SALAAR 2: సలార్ మూవీ వెయ్యికోట్ల కల నెరవేరకపోయినా రూ.730 కోట్ల వరకు వసూళ్లొచ్చాయి. అలా సంతోషపడుతున్న బ్యాచ్ ఇంకా హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఎందుకంటే వచ్చే ఏడాది మధ్యలో పట్టాలెక్కాల్సిన సలార్ సీక్వెల్‌ని ఈ ఏడాదే మొదలు పెడుతున్నాడు. ప్రశాంత్ నీల్ నిర్ణయం మ్యాన్ ఆఫ్ మాసెస్‌ని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో మూవీ ప్లాన్ చేశాడు.
KALKI 2898 AD: కల్కి టీజర్.. అమెరికాలో రిలీజ్.. కారణం ఇదే..
తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అలాంటిది తనతో సినిమా మొదలవ్వక ముందే సలార్ 2 అనేసరికి అంతా ఆశ్చర్య పడాల్సి వస్తోంది. ఐతే ఎన్టీఆర్ మాత్రం దేవర షూటింగ్ ఇంకా మే వరకు కొనసాగేలా ఉందని, మార్చ్‌లో 20 రోజులు హిందీ మూవీ వార్ 2 కోసం కేటాయించాడని తెలుస్తోంది. ఈ రెండింటితోనే ఈ ఏడాది గడిచేలా ఉంది. దీంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకంటే ముందే సలార్ 2ని పట్టాలెక్కించాలనుకుంటున్నాడట.
నవంబర్ రెండో వారం నుంచి సలార్ 2 షూటింగ్ అంటున్నారు. ఈలోపు కల్కి రిలీజవుతుంది. మారుతి మూవీ పూర్తవుతుంది. హనురాఘవ పూడి సినిమా సగం పైనే పూర్తవుతుంది. స్పిరిట్‌తోపాటు సలార్ 2ని ఒకేసారి తెరకెక్కించాల్సి వచ్చేలా ఉంది.