స్పిరిట్ బడ్జెట్ 1000 కోట్లా..? రెబల్ స్టార్ + రెబల్ స్టార్ తో సునామీ…

రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే దగ్గరకొస్తోంది కాబట్టి, ఎలాంటి కొత్త అప్ డేట్స్ వస్తయో అచ్చ అంచనాలు ఫ్యాన్స్ మధ్య పెరిగాయి. ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ తాలూకు అప్ డేట్ లకోసం ఫ్యాన్స్ఎదురు చూస్తుంటే, 1000 కోట్ల షాక్ ఇస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.

  • Written By:
  • Publish Date - October 8, 2024 / 06:59 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే దగ్గరకొస్తోంది కాబట్టి, ఎలాంటి కొత్త అప్ డేట్స్ వస్తయో అచ్చ
అంచనాలు ఫ్యాన్స్ మధ్య పెరిగాయి. ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ తాలూకు అప్ డేట్ లకోసం ఫ్యాన్స్ఎదురు చూస్తుంటే, 1000 కోట్ల షాక్ ఇస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తను 3 కోట్లు పెట్టి తీసిన అర్జున్ రెడ్డి 50 కోట్లు వసూళు చేసింది. అదే 50 కోట్లు పెట్టి అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేస్తే కబీర్ సింగ్ 250 కోట్లు రాబట్టాడు. తర్వాత యానిమల్ ని 250 కోట్లు పెట్టి తీస్తే ఆల్ మోస్ట్ అది 900 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఆ 900 కోట్లకు మరో వందకోట్లు అదనంగా కలిపి రెబల్ స్టార్ స్పిరిట్ తీస్తున్నారట. నిజానికి 500 కోట్ల బడ్జెట్టే ప్రైమరీ ప్లానింగ్. కాని సలార్, కల్కీ హిట్ అయిన విధానం, స్పిరిట్ లో పాన్ ఆసియా మార్కెట్ కోసం కొరియా, చైనీస్, స్టార్లను కూడా తీసుకోవాల్సి రావటం వల్ల, బడ్జెట్ అంచనాలు పెరగుతున్నాయి. అలా చూసినా 750 కోట్లే బార్డర్ లైన్… కాని ఇప్పడది 1000 కోట్లు గా మారబోతోందా? ఆ ఎక్స్ ట్రా 250 కోట్లు వెనక రెబల్ స్టార్ వన్ ప్లస్ వన్ ఆఫరుందా?

రెబల్ స్టార్ ప్రభాస్ తో యాంగ్రి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమ బడ్జెట్ ఇంకా షూటింగ్ మొదలు కాకముందే, మూడు సార్లు మారిపోయింది. ఆరేంజ్ లోసినిమాను ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ…

ముందు 500 కోట్లు, తర్వాత 750 కోట్లు, ఇప్పడు 1000 కోట్లు.. ఇది స్పిరిట్ బడ్జెట్ లో మార్పు… షూటింగ్ మొదలై, అనుకున్న బడ్జెట్ మించుతోందంటే అర్ధముంది. అలాంటిది షూటింగ్ ని మొదలు పెట్టకుండానే, ఇలా బడ్జెట్ పెంచుతున్నరంటేనే అదో సెన్సేషనౌతోంది. దీనికి వెనకున్న రీజన్ ఎవరికైనా మైండ్ బ్లాక్ చేయాల్సిందే

స్పిరిట్ కథ, కథనం, డైలాగ్స్ కూడా పూర్తిచేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు ఈ సినిమాకు హిందీ, తమిల్, మలయాళం, కన్నడ తోపాటు, బంగాలి, పంజాబీ, మరాఠీ, కొరియన్, చైనీస్, జపనీస్ డైలాగ్ రైట్స్ తో ఆ వర్షన్ కూడా రెడీ చేయిస్తున్నారట

ఇటాలియన్, రష్యన్, జర్మన్ లోకూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలనేదే సందీప్ రెడ్డి వంగ ప్లానింగ్. తన యానిమల్ మూవీ సాంగ్స్ ని , డైలాగ్స్ ని డబ్బింగ్ కోసం ఎంచుకున్న ఆర్టిస్ట్ లనీ ఇలా ప్రతీది పక్కగా ప్లాన్ చేసేసరికే, యానిమల్ రిలీజ్ డేట్ నుంచి 3 నెల్లు వెనక్కి వెల్లాల్సి వచ్చింది. అంత పక్కగా ఉన్నాడు కాబట్టే, అన్ని భాషల్లో యానిమల్ రీచ్ పెరిగింది

ఇప్పుడు ఇటాలీయన్, కొరియన్, చైనీస్, జపనీస్, జర్మన్, రష్యన్ లో కూడా ఈ మూవీని భారీ ఎత్తున రీలీజ్ చేయాలనుకోవటానికి కారణం, అక్కడి ఆర్టిస్ట్ లను కూడా తీసుకుంటున్నారట. కొరయన్ డాంగ్ లీ తోపాటు, చైనీస్, రష్యన్, ఇటాలీయన్ ఆర్టిస్ట్ వేట మొదలైంది. ఇక అనీల్ కపూర్, సైఫ్ ఆలీఖాన్, కరీనా స్పెషల్ రోల్స్ వేస్తున్నారు. ఇలా చూస్తే ప్రభాస్ 300 కోట్లు రెమ్యునరేషన్ అయితే, మిగతా స్టార్స్ పారితోషికం 300 కోట్టు, ఇక 300 కోట్లు మేకింగ్ కి, 50నుంచి 100 కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా స్పిరిట్ మూవీ ప్రమోషన్ కి అని తెలుస్తోంది.

ఇక మేకింగ్ కే 300 కోట్లు ఖర్చు అవటానికి కారనం, ఇందులో ఇద్దరు ప్రభాస్ లు ఉంటారని తెలుస్తోంది. బిల్లారంగా, భాహుబలి తర్వాత మరోసారి డ్యూయెల్ రోల్ వేయబోతున్న ప్రభాస్ విషయంలో, ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ వాడి ప్రభాస్ వేసే రెండో పాత్రని డిజైన్ చేస్తున్నారట. దానికి కొత్త టెక్నాలజీని వాడుతున్నారని తెలుస్తోంది. ఆ గ్రాఫికల్ వర్క్ కే 120 నుంచి 150 కోట్ల వరకు ఖర్చొస్తోందట.. ఇలా బడ్జెట్ 750 నుంచి 1000 కోట్ల వరకు పెరుగుతోందని తెలుస్తోంది.