అంతా బానే ఉంది కాని, 8 రోజుల తర్వాత ఆదిపురుష్ ఛాప్టర్ క్లోజ్ అయ్యేలా ఉందట. వసూళ్లు భారీగానే వస్తున్నాయి కదా అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కో రోజు ఈ సినిమా వసూళ్లలో 20నుంచి 25 కోట్లు తగ్గుతూవస్తున్నాయి. ఫస్ట్ డే 130 కోట్లొస్తే, సెకండ్ డే 90 కోట్లొచ్చాయి. మూడో రోజు 75 కోట్లని తేలింది. నాలగవరోజు 55 కోట్లకు లెక్క తగ్గింది.
ఇలా రోజుకి 15 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య వసూళ్లు డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఇలా లెక్కేస్తే ఎనిమిదో రోజుకి వసూళ్లు 10 కోట్లకు పడిపోయే ఛాన్స్ ఉంది. అలాచూస్తే 700 కోట్ల పెట్టుబడి కాస్తా.. రాబడిగా మారకముందే వసూళ్ల జోరుకి బ్రేక్ పడుతుంది. అదే జరిగితే ఈ సినిమా వసూళ్ళ పరంగా సెన్సేషన్ అయినా, పెట్టుబడి ని రాబడిగా మార్చలేకపోవటంతో ఫెల్యూర్ గా ప్రకటించాల్సి వస్తుంది.