నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే కనిపించనుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా విడుదల అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరో నాలుగు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం స్పెషల్ షోలు వేసుకోవడంతో పాటు టికెట్ రేట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచాయి.
స్పెషల్ షోలు..
నిర్వహించుకునేందుకు ఈ నెల 27 నుంచి జులై 4 వరకు అనుమతి ఇచ్చింది. రోజుకు ఐదు షోలు వేసుకోవడంతో పాటు టికెట్ ధర రూ.200 పెంచుకునేందుకు హోంశాఖ అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలో టికెట్ రేట్లు పెరిగాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.377 ఉండగా, మల్టీప్లెక్స్‌లలో రూ.495గా పెంచారు. బెనిఫిట్ షో తర్వాత రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265 ఉండగా, మల్టీప్లెక్స్‌లలో రూ.413గా ఫిక్స్ చేశారు.
ఓవర్సీస్‌లో ముందు రోజు ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి కాబట్టి.. అక్కడక రివ్యూలు కాస్త ముందే రానున్నాయి. అయినా.. ఫస్డ్ డే కాదు, వీకెండ్ వరకు ప్రభాస్ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లకు క్యూ కడతారు జనాలు. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి రావడం పక్కా. అసలే సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాలు రాలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి రెడీ అవుతోంది కల్కి.