Adipurush: ఆదిపురుష్‌ రామాయణం కాదు.. సినిమా రైటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఆదిపురుష్‌ సినిమా వరుస వివాదాల్లో కొనసాగుతోంది. రామాయణంలో యుద్ధకాండను సినిమాగా తీసినప్పటికీ అసలు రామాయణానికి ఆదిపురుష్‌ సినిమాకు చాలా తేడాలున్నాయి.

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 01:05 PM IST

గెటప్స్‌ విషయంలోనే కాదు.. డైలాగ్స్‌ విషయంలో కూడా ఈ సినిమా మీద చాలా విమర్శలు వస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ సినిమా డైరెక్టర్‌ మీద చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆదిపురుష్‌ రైటర్‌ మనోజ్‌ ముంతశిర్‌ సినిమా గురించి కీలక ప్రకటన చేశాడు. అసలు తాము తీసింది రామాయణం కాదని.. రామాయణం ఆధారంగా రాసిన ఓ కథ అంటూ చెప్పాడు. సినిమాలో సంపూర్ణ రామాయణం చూపించలేదని.. కేవలం రావణుడు సీతను అపహరించడం, యుద్ధం మాత్రమే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కథ రాశానన్నాడు. ఇదే విషయాన్ని సినిమా ప్రారంభలోనే డిస్‌క్లైమర్‌లో కూడా ఇచ్చామన్నాడు.

అయితే మనోజ్‌ చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు ఫ్యాన్స్‌కు మరింత కోపం తెప్పిస్తున్నాయి. రామాయణం కాకపోతే రాముడు, సీత, హనుమంతుడు, రావణుడు ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. కథలో మార్పులు చేసి కవర్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్‌ అవుతున్నారు. రామాయణంలోని క్యారెక్టర్స్‌ని పెట్టి రామాయణం కాదు అంటే ఎవరు యాక్సెప్ట్‌ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏంటి అంటే రామాయణాన్ని సినిమాగా తీస్తున్నామంటూ ఇదే మూవీ యూనిట్‌ సినిమా స్టార్ట్‌ చేసినప్పుడు ఎనౌన్స్‌ చేసింది. రాముడిగా ప్రభాస్‌ కనిపించబోతున్నాడంటూ చెప్పి హైప్‌ క్రియేట్‌ చేసింది.

ఇప్పుడు అవుట్‌పుట్‌ తేడా కొట్టడంతో ఇది రామాయణం కాదంటూ బుకాయించడం మొదలు పెట్టింది. ఇది మరో వివాదానికి తెర లేపుతోంది. సినిమా కలెక్షన్స్‌, రికార్డ్స్‌ సంగతి పక్కన పెడితే.. ఆదిపురుష్‌ను వెంటాడుతున్న ఈ వరుస వివాదాలు ఎప్పుడు ఆగుతాయో చూడాలి.