ముందుగా నేపాల్ సెన్సార్ బోర్త్ తమ గడ్డ మీద పుట్టిన సీతను భారత బిడ్డ అనటం మీద అభ్యంతరం వ్యక్త పరిచింది. దీంతో సినిమాలో భారత బిడ్డ అనే డైలాగ్ ని తీసేసింది ఫిల్మ్ టీం. కట్ చేస్తే ఇప్పుడు లాస్ట్ టెంపుల్ అనే ట్విట్టర్ హ్యాండిల్ చేసిన కామెంట్స్ షాక్ ఇస్తోంది. అప్పట్లో రామానంద్ సాగర్ తీసిన రామాయనం సీరీయల్ ముందు ఏది సాటిరాదని కామెంట్ పెట్టింది.
అంతే అలాంటి జెన్యూన్ ట్విట్టర్ హ్యాండిల్ ఇలాంటి కామెంట్ పెట్టడం, ఆదిపురుష్ మూవీ ని అవమానించటమే అనంటున్నారు. హరీష్ శంకర్ అయితే రామాయణం సీరియాల్ అందరికి నచ్చుతుంది కాని, ఓ సెక్యూర్డ్ హ్యాండిల్ ఇలాంటి పోస్ట్ పెట్టడం బాధాకరం అన్నాడు.. ఇదేనా ఇప్పుడు తెలంగాణలో 12 చోట్ల సినిమా బాలేదని కొందరు మొదటి ఆటకే బయటికివచ్చి కామెంట్స్ చేయటంతో, ఫ్యాన్స్ వాళ్లని చితకబాదటం కూడా వివాదమౌతోంది. ప్రభాస్ మీద యాంటీ ఫ్యాన్స్ దాడి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా, ఇలాంటి కారణాలేవి ఉన్నా ఆదిపురుష్ కి వివాదల గోల ఇలా కంటిన్యూఅయ్యేలానే కనిపిస్తోంది.