ప్రభాస్ తో సుకుమార్ కాంబినేషన్..? ఏదో జరుగుతోంది..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సుకుమార్ సినిమా ఇంతవరకు ఎప్పుడూ సెట్ కాలేదు. ఆర్య, వన్ నేనొక్కడినే, రంగస్థలం, పుష్ప ఇవి చూసిన జనానికి ఆ దర్శకుడి మేకింగ్ లో ప్రభాస్ ఎలా ఉంటాడనే ఆలోచన కామన్.. ఐతే అదే ఇప్పుడు నిజం కాబోతోంది.

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 04:00 PM IST

పాన్ ఇండియా లెవల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్న సూపర్ హీరో ప్రభాస్, ఓ చిన్న పాత్రను కూడా ఊరమాస్ రూట్లో పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అయ్యేలా చేసిన పుష్ప మేకర్. ఈఇద్దరి కాంబినేషన్ అంటే పెట్రోల్ కి లైటర్ తోడైనట్టే.. మొత్తం ఫైరే.

పుష్ప 2 డిసెంబర్ లోగా షూటింగ్ పూర్తవుతుంది. తర్వాత సుకుమార్ రామ్ చరణ్ కోసం పనిచేస్తాడన్నారు. ఈలోపు శంకర్ మూవీ, బుచ్చిబాబు సినిమా పూర్తి చేస్తాడు చెర్రీ. సో ఈ ప్రాజెక్ట్ 2024 లో పట్టాలెక్కి 2025 లో రిలీజ్ అవ్వొచ్చు. ఇక 2025 దసరాకే ప్రభాస్ తో సుకుమార్ సినిమా పట్టాలెక్కొచ్చాట.

ప్రభాస్ సలార్ ని వచ్చేనెలలోగా పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఇక మారుతి మూవీ జూన్ కల్లాపూర్తవుతుంది. ఇక దసరాలోగా ప్రాజెక్ట్ కే పూర్తై, సందీప్ రెడ్డి సినిమా మొదలైతుంది. 2024 లో మాత్రం హిందీ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంత్ మూవీమొదలవుతుంది. అది 2025 దసరాలోగా పూర్తయితే, అప్పుడుసుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట.