మిర్చీ సినిమా వరకు ప్రభాస్ ఎవరో బాలీవుడ్ కి తెలియదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇంటి అడ్రస్ తో సహా తెలుసుకోవాల్సిన పరిస్థితి బాలీవుడ్ ది. ఇండియన్ సినిమా అంటే మాదే అని విర్ర వీగిన బాలీవుడ్ కోరలు పీకింది మాత్రం ప్రభాస్. ఇప్పుడు సౌత్ లో భారీ సినిమాలు వస్తున్నాయంటే బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితోనే. ఒక్కో సినిమా ఒక్కో రికార్డ్ ని కొల్లగొడుతూ బీ టౌన్ కు కంటి మీద కునుకు లేకుండా చేయడం మొదలుపెట్టింది. బాహుబలి తర్వాత వచ్చిన కేజిఎఫ్, విక్రం, కాంతారా, కల్కీ సినిమాలు గట్టిగానే వసూలు చేయడం మొదలుపెట్టాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాదే శ్యాం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ ఇమేజ్ ఎప్పటికైనా తమకు ఇబ్బందే అని ఆదిపురుష్ తో దెబ్బకొట్టింది బాలీవుడ్. అక్కడ ప్రభాస్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ప్రభాస్ రూట్ మార్చాడు. సౌత్ డైరెక్టర్ లతో సినిమాలు చేయడం మొదలుపెట్టి వరుస హిట్ లు కొడుతున్నాడు. కల్కీ సినిమాతో బాలీవుడ్ కి ఒక టార్గెట్ సెట్ చేసాడు. ఆ టార్గెట్ అందుకోవడానికి బాలీవుడ్ కి ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. ఒక్కో సినిమాతో బాలీవుడ్ ని ఎక్కడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నాడు.
అందుకే బాలీవుడ్ డైరెక్టర్ లు అడిగినా చేయను అని చెప్పేస్తున్నాడు. సలార్, కల్కీ సూపర్ హిట్ లు అయ్యాయి. రాజా సాబ్, స్పిరిట్, కల్కీ 2 తో బాలీవుడ్ ఇంకా గట్టిగా తొక్కేందుకు సిద్దమవుతున్నాడు. తనను టార్గెట్ చేసిన బాలీవుడ్ ని సోదిలో కూడా లేకుండా చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు అంటున్నారు సినీ జనాలు. సిద్దూ జొన్నలగడ్డ అన్నట్టు… ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు బాలీవుడ్ హిట్ సినిమాలకు వచ్చే వసూళ్లు దాదాపు సమానంగా ఉన్నాయి. ప్రభాస్ తో సినిమా చేసిన నిర్మాతలు భయపడే పరిస్థితి అయితే నూటికి నూరు శాతం లేదు.