Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సార్లు రిస్క్ తీసుకోవటం వల్ల దెబ్బలు తగిలాయి. కొన్ని సార్లు కలిసొచ్చాయి. కాని సలార్ విషయంలో రిస్క్ వద్దంటున్నాడు. ఒకటి కాదు వందకోట్ల అడుగులు వెనక్కి వేస్తానంటున్నాడు.
ఆదిపురుష్ మూవీ టైంలోచేసిన తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటున్నాడట ప్రభాస్. ఆదిపురుష్ మూవీ టైంలో తన ఓన్ కంపెనీ లాంటి యూవీ క్రియేషన్స్‌కి తెలుగు రైట్స్ డీల్ సెట్ చేశాడు. ఏమైంది, 100 కోట్ల పంచ్ పడింది. ఆ సంస్థ దివాళా తీసే పరిస్తితి వచ్చింది. సో అలా జరక్కుండా ఉండాలంటే, ఈసారి రెమ్యునరేషన్‌తోపాటు కొన్ని ఏరియా రైట్స్‌తో సరిపెట్టుకోవాలి. కాని సలార్ బిజినెస్‌లో అడుగు పెట్టకూడదనుకుంటున్నాడట. అంటే సలార్ మీద నమ్మకం లేదా..? ఈ మూవీ నైజాం రైట్స్ విషయంలో దిల్ రాజు వెనకడుగు వేశాడు.
ఇప్పుడు ప్రబాస్ తన సొంతం సంస్థలాంటి యూవీకి డీల్ సెట్ చేయనన్నాడు. అంటే కాన్ఫిడెన్స్ లేకా అంటే అదేం లేదు. సలార్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్రైట్స్ ఏకంగా రూ.200 కోట్లని తెలుస్తోంది. అందుకే దిల్ రాజు వెనకడుగు వేశాడు. ఆదిపురుష్ పంచ్ వల్ల యూవీ క్రియేషన్స్ రైట్స్ కొనే స్థితిలో లేదు. అందుకే ఈ అంశాల్లో జోక్యం చేసుకోకుండా తన పని తానుచేసుకుంటున్నాడు ప్రభాస్.