prabhas: రెబల్ బాంబుని పేల్చాడా..? వాటే టైమింగ్..? ఫ్యాన్స్ కి 3 పండగలు..!

ఈ ఏడాది ఎండింగ్‌లో సందీప్ రెడ్డి వంగ మేకింగ్‌లో స్పిరిట్ పట్టాలెక్కడం కన్పామ్ అయ్యింది. క్రిస్మస్‌కే స్పిరిట్ మూవీ లాంచ్ కాబోతోందని తెలుస్తోంది. ఇక సంక్రాంతికి సుకుమార్ మేకింగ్‌లో ప్రభాస్ మూవీ లాంచ్ కాబోతోందట.

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 05:26 PM IST

prabhas: ప్రభాస్ ఓవైపు ఆదిపురుష్‌తో సందడి మొదలుపెట్టాడు. మరో వైపు రెండు నిర్ణయాలతో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇచ్చేస్తున్నాడు. ఈ ఏడాది ఎండింగ్‌లో సందీప్ రెడ్డి వంగ మేకింగ్‌లో స్పిరిట్ పట్టాలెక్కడం కన్పామ్ అయ్యింది. క్రిస్మస్‌కే స్పిరిట్ మూవీ లాంచ్ కాబోతోందని తెలుస్తోంది. ఇక సంక్రాంతికి సుకుమార్ మేకింగ్‌లో ప్రభాస్ మూవీ లాంచ్ కాబోతోందట.

రెండూ కూడా ప్యారలల్‌గా తెరకెక్కబోతున్నాయి. పుష్ప 2 షూటింగ్ తో బిజీ అయిన సుకుమార్ ఎప్పుడు ప్రభాస్ కోసం కథ రాశాడు.. ఎప్పుడు తీస్తాడు అన్న డౌట్లే వద్దు. ఆల్రెడీ ప్రభాస్‌కి స్టోరీ నెరేట్ చేసిన సుకుమార్, కథనంతోపాటు బౌైండెడ్ స్క్రిప్ట్‌కి మూడు నెలల టైం అడిగాడట. సో అక్టోబర్‌లో పుష్ప 2 షూటింగ్ పూర్తౌతుంది. క్రిస్మస్‌కి వచ్చే ఈ సినిమా తాలూకు ప్రమోషన్లు ఒకవైపు, సంక్రాంతి లోపు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీచేసే పనులు మరోవైపు.. అలా సంక్రాంతికల్లా సినిమాని సెట్స్ పైకి తీసుకెళుతాడట సుకుమార్. ఇక సందీప్ రెడ్డి వంగ మేకింగ్‌లో ప్రభాస్ చేసే స్పిరిట్ మూవీ కథ ఎప్పుడో రెడీ అయ్యింది. తన యానిమల్ మూవీ ఆగస్ట్ 11 న రాబోతోంది. సో ఆ తర్వాత మరోసారి స్క్రిప్ట్ మీద కూర్చునే సందీప్ క్రిస్మస్‌కి మాత్రం ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తాడట.

ఇలా ఒకేసారి అర్జున్ రెడ్డి ఫేం, పుష్ప డైరెక్టర్ ప్రభాస్‌తో సినిమాలు ప్లాన్ చేయటం, 20 రోజుల గ్యాప్‌లో ఆ ప్రయోగాలను పట్టాలెక్కించబోవటం మాత్రం ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయం. అన్నీంటికి మించీ ఆదిపురుష్, సలార్ తర్వాత ఇలాంటి టైమింగ్‌లో అలాంటి ప్రాజెక్టులు పట్టాలెక్కబోతుండటం చూస్తుంటే, ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్‌ని మరో మూడేళ్లు ఈజీగా శాసించేలా ఉన్నాడు.