బాహుబలి (Baahubali) భారీ బ్లాక్ బస్టర్‌తో టాలీవుడ్ నుంచి అందరి కంటే ముందుగా పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. బాహుబలి నుంచి ప్రభాస్ వేస్తున్న ప్రతి అడుగు అతడిని హిట్టులతో సంబంధం లేకుండా గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్తూనే ఉన్నాయి. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అందరినీ తన వైపుకి తిప్పుకున్నాడు డార్లింగ్.. రెబల్ స్టార్‌గా అతను చేస్తున్న ప్రతి సినిమా మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందించేలా ఉందనే చెప్పాలి. ఇక.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ పెరిగిన తీరు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కెరీర్ పరంగా ఇప్పుడు టాప్ స్పీడ్ లో వున్న ప్రభాస్ 2025 వరకు ఫుల్ బిజీగా ఉన్నాడంటే తన కెరీర్ ఏ రేంజ్‌లో పరుగులు పెడుతుందో అర్థం చేసుకోవచ్చు..
ఇలాంటి టైమ్‌లో ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD) పై వరల్డ్ వైడ్‌గా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ అపీల్ కి దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ తోడవడంతో ఇప్పుడు ప్రభాస్ యూనివర్సల్ గ మరో స్థాయికి వెళ్లడం గ్యారెంటీ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సంబంధించిన జస్ట్ ఓటిటి ప్రీల్యూడ్ చూస్తేనే మేకర్స్ గ్లోబల్ లెవెల్లో రీచ్ ఉండేలా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు..
ఈ తరహా యూనివర్సల్ అపీల్ ఉండే సిరీస్ లు సినిమాలు మనం హాలీవుడ్ (Tollywood) నుంచి ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఇదే కోవలో కల్కి కూడా ఉండడంతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కావడం ఖాయమంటున్నారు. ఇప్పటికే రిలీజైన బుజ్జి ప్రోమో శాంపిల్ బట్టి చూస్తుంటే.. ఇదే ఈ లెవెల్లో ఉంటే సినిమా కూడా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పడంలో డౌట్ లేదంటున్నారు. వీటన్నింటి బట్టి చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోవడం ఖాయమంటున్నారు. నిజానికి బాహుబలి సీరీస్ తరువాత ప్రపంచం లో వున్న తెలుగు వారే కాకుండా సినిమా అభిమానులంతా ప్రేమించే హీరోగా రెబల్‌స్టార్ ప్రభాస్ ఎదిగిపోయాడు. మరి.. కల్కి మూవీ రిలీజయ్యాక ప్రభాస్ మానియా ఊహకు కూడా అందంటున్నారు సినీ విశ్లేషకులు..