Kalki 2898 AD: లక్కీడేట్.. కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈసారి డార్లింగ్ లెక్కలన్నీ సరి చేస్తాడు..!

ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించగల సత్తా ఉన్న సినిమా 'కల్కి' అని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. 'కల్కి 2898 AD' సినిమాను 2024, మే 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లుగా ఇటీవల వార్తలొచ్చాయి.

  • Written By:
  • Updated On - January 12, 2024 / 04:40 PM IST

Kalki 2898 AD: ‘సలార్’ (SALAAR)తో ప్రేక్షకులను అలరించిన రెబల్ స్టార్ ప్రభాస్ (PRABHAS).. త్వరలో ‘కల్కి 2898 AD’తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ (NAG ASHWIN) దర్శకత్వంలో రూపొందుతోంది ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది.

Guntur Kaaram Review: ఇలా చేసావేంటి ర‌మ‌ణా..? గురూజీని.. కుర్చీ మడతపెట్టి..!

ప్రభాస్ కెరీర్‌లో ‘బాహుబలి’ ఫ్రాంచైజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించగల సత్తా ఉన్న సినిమా ‘కల్కి’ అని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ‘కల్కి 2898 AD’ సినిమాను 2024, మే 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లుగా ఇటీవల వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 9న సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ అనౌన్స్‌మెంట్ రొటీన్‌కి భిన్నంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో విభిన్న తరహాలో రిలీజ్ డేట్‌ని రివీల్ చేశారు. కాగా మే 9 అనేది వైజయంతీ సంస్థకి సెంటిమెంట్ డేట్.

ఆ సంస్థ నుంచి వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ 1990 మే 9న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా, 2018 మే 9న విడుదలైన ‘మహానటి’ కూడా సంచలన విజయం సాధించింది. మరి అలాంటి బ్లాక్ బస్టర్ డేట్‌కి వస్తున్న ‘కల్కి’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.