KALKI 2898 AD: బాబోయ్ భారీగానే ప్లాన్.. పాట కోసమే రూ.10 కోట్లు..

ఈ సినిమా బడ్జెట్ సుమారు ఆరొందల కోట్ల పైమాటే అని టాక్. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లను ఊపేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 05:41 PM IST

KALKI 2898 AD: రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి అల్ట్రా డిజాస్టర్‌ల తర్వాత సలార్‌తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. బాక్సాఫీస్ దగ్గర రూ.800 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలో అత్యంత కాస్ట్‌లీయెస్ట్ సినిమాగా రూపొందుతున్న కల్కిలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ సుమారు ఆరొందల కోట్ల పైమాటే అని టాక్. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లను ఊపేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Rakul Preet Singh: రకుల్ పెళ్లి భోజనం మెనూ.. వామ్మో అన్ని రకాల డిషెస్..!

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న కల్కి సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ ను రూపొందిస్తున్నారట. ఈ పాటలో దిశా పటానీ నర్తించనుందట. అంతేకాకుండా అండర్ వాటర్‌లో ఈ పాట తెరకెక్కబోతుందట. ఇప్పటికే సాంగ్ షూటింగ్ మొదలైందిని కూడా ఇన్ సైడ్ టాక్. కేవలం ఈ పాట కోసమే మేకర్స్ దాదాపుగా 10 కోట్లు ఖర్చుపెడుతున్నారట. ఇంత వరకు మనం చూడని వీఎఫ్ఎక్స్ ను ఈ పాటలో చూపించబోతున్నారట. మరో ప్రపంచంలో ఉన్నామా అనే విధంగా ఈ సాంగ్ రూప కల్పన జరుగుతుందట. ఇదిలా ఉంటే.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో తెరకెక్కిస్తున్నాడు. ముందుగా సింగిల్ పార్ట్ లో కంప్లీట్ చేయాలనుకున్నా.. ఒకే పార్టులో ఇంత గొప్ప స్టోరీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెప్పడం సరికాదని.. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తొలిపార్టుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం సెకండ్ పార్ట్‌కు సంబంధించిన కొన్ని సీన్లను తెరకెక్కిస్తున్నారట.

ఈ సీన్లను ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో యాడ్ చేసి, సెకండ్ పార్ట్‌పై క్యూరియాసిటీని పెంచేలా ప్లాన్ చేస్తున్నారట.బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే ఇలా స్టార్ కాస్ట్ అంతా ఈ సినిమాలో ఉండటంతో ఆడియెన్స్ లో కల్కిపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇలా టాలీవుడ్ స్టార్ లు సైతం క్యామియోలు చేస్తున్నట్లు న్యూస్ రావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.