KALKI 2898 AD: ఎంత లేట్ అయితే అంత రేటు.. అది కూడా మంచికే..

రిలీజ్ డేట్ ఎంత లేటైతే అంత మంచిదనటానికి మూడు కారణాలున్నాయి. ముందుగా గ్రాఫిక్స్ వర్క్‌లో క్వాలిటీ పెంచే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పూర్తి చేసిన గ్రాఫిక్స్ వర్క్‌లో కొన్ని సీన్ల సీజీ వర్క్ రీ సెట్ చేస్తున్నారట. కాబట్టి.. మరింత టైం దొరికితే కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ పెంచొచ్చు.

  • Written By:
  • Updated On - April 20, 2024 / 09:06 PM IST

KALKI 2898 AD: కల్కి మూవీ రిలీజ్ డేట్ మే 9 నుంచి మే 30కి, ఆ తర్వాత జులై 10, జులై 12 వరకు ఇలా రకరకాలుగా మారేలా ఉంది. ఇంత వరకు పోస్ట్‌పోన్ డేట్ అఫీషియల్‌గా తేల్చలేదు. కాని ఊహాగానాలు ఆగట్లేదు. కాని ఈ సినిమా రిలీజ్ డేట్ ఎంత లేటైతే అంతగా వసూళ్ల ఘాటు పెరిగే ఛాన్స్ ఉందన్న లెక్కే కిక్ ఇస్తోంది. ఇక రిలీజ్ డేట్ ఎంత లేటైతే అంత మంచిదనటానికి మూడు కారణాలున్నాయి.

Kurchi Madathapetti song: కుర్చీ మడతపెట్టి పాటకు యమ క్రేజ్‌.. 200 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌

ముందుగా గ్రాఫిక్స్ వర్క్‌లో క్వాలిటీ పెంచే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పూర్తి చేసిన గ్రాఫిక్స్ వర్క్‌లో కొన్ని సీన్ల సీజీ వర్క్ రీ సెట్ చేస్తున్నారట. కాబట్టి.. మరింత టైం దొరికితే కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ పెంచొచ్చు. ఇక నార్త్ ఇండియా రైట్స్‌తోపాటు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రేటు మరింత ఘాటెక్కేలా ఉంది. డిమాండ్ ఆరేంజ్‌లోఉంది. కాబట్టి.. రిలీజ్ డేటు లేటయ్యే కొద్ది ఈ సినిమా మీదున్న క్రేజ్ మరింత పెరగటంతో, డిస్ట్రిబ్యూటర్ల నుంచి మరింత డిమాండ్ చేసే ఛాన్స్ నిర్మాతకి దక్కింది. ఇలా ఈ రెండు కారణాలే కాకుండా.. ఎలక్షన్ల టైంలో సినిమా వస్తే, ఆ హడావిడి వల్ల ఈ సినిమాకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కదు. కొన్ని చోట్ల సినిమా రిలీజ్ సాధ్యపడకపోవచచు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో డేట్‌కి ఓటింగ్ ఉంది కాబట్టి.. ఏదో ఒక మార్కెట్‌లో ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి.. జులై సెకండ్ వీక్‌కి రిలీజ్ డేట్ మారిస్తే, ఇక ఎలాంటి అంతరాయం లేకుండా కల్కి కలెక్షన్స్ దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. అన్ని విధాలా వాయిదానే కల్కికి ప్లస్ అయ్యేలా ఉంది. ఎంత లేటైతే అంతాగా వసూళ్ల ఘాటు పెరిగే ఛాన్స్ ఉంది.