Kalki 2898 AD: రిలీజ్ డేట్ ఎందుకు లేదు..? ప్రభాస్ ‘కల్కి’ డౌటేనా..?

సినిమా రిలీజ్‌కు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో.. భైరవ వచ్చి ఒక్కసారిగా మంచి హైప్‌ క్రియేట్ చేసేశాడు. అయితే.. ఈ పోస్టర్‌లో మాత్రం రిలీజ్ డేట్ లేదు. దీంతో మే 9న కల్కి రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.

  • Written By:
  • Updated On - March 9, 2024 / 05:30 PM IST

Kalki 2898 AD: సినిమా టైటిల్ కల్కి కాబట్టి.. ప్రభాస్ క్యారెక్టర్ పేరు కూడా కల్కినే అనుకున్నారు. కానీ మహా శివరాత్రి సందర్భంగా కల్కి 2898 ఏడిలో ప్రభాస్ పేరు భైరవ అని సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ ఈ సినిమాలో నాలుగైదు సరికొత్త పాత్రల్లో కనినిపిస్తున్నట్టుగా టాక్ ఉంది. అందులో ఓ క్యారెక్టర్ పేరు భైరవ అని అంటున్నారు. ఇక.. ఈ పోస్టర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ భైరవ లుక్‌లో యమా క్రేజీగా ఉన్నాడు.

MAHESH BABU: ప్రభాస్, చరణ్, బన్నీ తర్వాతి స్థానంలో ఎన్టీఆర్

ఈ ఒక్క లుక్ చాలు.. సినిమా ఎలా ఉండబోతుందో అని చెప్పడానికి అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరెస్తున్నారు. గతంలో వచ్చిన పోస్టర్స్ కంటే భైరవ పోస్టర్ సూపర్‌గా ఉందంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా రాని హైప్.. భైరవ లుక్‌తో వచ్చింది. సినిమా రిలీజ్‌కు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో.. భైరవ వచ్చి ఒక్కసారిగా మంచి హైప్‌ క్రియేట్ చేసేశాడు. అయితే.. ఈ పోస్టర్‌లో మాత్రం రిలీజ్ డేట్ లేదు. దీంతో మే 9న కల్కి రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కల్కి వచ్చేస్తున్నాడని చెప్పిన మేకర్స్.. ఇప్పుడెందుకు రిలీజ్ డేట్‌ వేయలేదనేది అర్థం కాకుండా ఉందంటున్నారు.

దీంతో ఈసారి కూడా వాయిదా తప్పదా? అని అంటున్నారు. అయితే… ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. పోస్టర్‌లో డేట్ వేయకున్న.. క్యాప్షన్‌లో మాత్రం మే 9న కల్కి వస్తున్నాడని ఉంది. కాబట్టి.. కల్కి మే 9న వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా గ్రాఫిక్స్ వర్క్ ఇన్‌ టైంలో కాకపోతే.. వాయిదా తప్పదని అంటున్నారు.