PRABHAS: సలార్ మూవీ రూ.700 కోట్ల క్లబ్‌లో చేరబోతోంది. ఈనెలలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ లాంటి తెలుగు సినిమాల వల్ల కొంతవరకు సలార్ వసూళ్ల ప్రభావం తగ్గొచ్చు. కాని అది కూడా తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. హిందీ బెల్ట్‌లో మాత్రం సలార్ దూకుడు ఇలానే జనవరి చివరి వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, అక్కడ ఈనెల 25న హ్రితిక్ రోషన్ ఫైటర్ మూవీ వచ్చే వరకు మరో సినిమా సందడి చేసే ఛాన్స్ లేదు.
SPIRIT: స్పిరిట్ కథ రెడీ.. ముందుగానే ప్రారంభం కానున్న షూటింగ్
కాబట్టి మరో 20 రోజులకు పైగా సలార్ సందడి నార్త్‌లో అలానే ఉంటే ఈజీగా 1000 కోట్ల వసూళ్లను దాటేస్తుంది. ఇక సలార్ ఊపు చూస్తుంటే, సలార్ 2 ఎప్పుడొస్తుందా అన్న చర్చ ఇప్పడే మొదలైంది. మరీ బాహబలి 2, కేజీయఫ్ 2 రేంజ్‌లో జనాల్లో క్యూరియాసిటీ లేదు కానీ.. సలార్ 2 మీద అంచనాలు పెంచేలా మాత్రం సలార్ క్లైమాక్స్ సీన్ ఉంది. ఐతే సలార్ 2 ఈ ఏడాది మొదలవ్వటం కూడా కష్టమే. కల్కి మేలో వస్తోంది కాబట్టి మార్చ్‌లోగా షూటింగ్ పూర్తవుతుందని తేలిపోతుంది. మారుతి మూవీ 30 శాతం పూర్తైంది. మూడు నెలలు కష్టపడితే ఆగస్ట్‌లోగా ఇది పూర్తౌతోంది. ఈలోగా స్పిరిట్‌ని ఏప్రిల్‌లో మొదలు పెట్టాలనుకుంటున్నాడు సందీప్.
ఇక హను రాఘవపూడి పీరియాడికల్ డ్రామా కూడా సమ్మర్‌లోనే మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే సలార్ 2 కాబట్టి 2025 సంక్రాంతికే సలార్ 2 మొదలయ్యే ఛాన్స్ ఉందట. ఈలోగా తారక్‌తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్న మూవీ పూర్తవుతుందట. అంతే కాదు తారక్ మూవీ 2025 దసరాకు, ప్రభాస్ సలార్ 2 మూవీ 2025 దీపావళికి అని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడనే ప్రచారం జరుగుతోంది.