The Raja Saab: ది రాజాసాబ్ పోస్టర్ తప్ప ఈ మూవీకి సంబంధించి మరే వీడియో కంటెంట్ కాని, మరే అప్‌డేట్ కాని బయటికి రావట్లేదు. కారణం కల్కి రిలీజ్ కాబోతుండటమే. అది విడుదలయ్యే వరకు ప్రభాస్‌కు సంబంధించి మరే సినిమాల అప్‌డేట్లు వీడియోల రూపంలో రిలీజ్ చేయటానికి వీళ్లేదు. ఇది నిర్మాతతో పాటు ప్రభాస్ కండీషన్ అనితెలుస్తోంది. అందుకే ది రాజాసాబ్ చిత్రానికి సంబంధించి ఏ సంగతి బయటికి రావట్లేదు.
Kurchi Madathapetti song: కుర్చీ మడతపెట్టి పాటకు యమ క్రేజ్.. 200 మిలియన్ ప్లస్ వ్యూస్
కాని జోనర్ ఏంటి, ఎలా ఉండబోతోంది, లాంటి విషయాలు మాత్రం బయటికి లీకుల రూపంలో పెరిగాయి. ఇదో కామెడీ ఎంటర్‌టైనర్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఈ సినిమాకు హర్రర్ జోనర్ యాడ్ అయిన మరో ఫ్లేవర్. కామెడీ, హర్రర్ జోనర్‌లో ఈ సినిమా వస్తుందా అంటే, పూర్తిగా కాదు. ఇది బాహుబలిలా పాంటసీ ఫ్లేవర్‌లో కూడా తెరకెక్కుతోంది. ఊహాజనిత పాత్రలు, ఊహాజనిత ప్రపంచం లాంటివి రాజాసాబ్‌లో ఉండబోతున్నాయి. ఇక ప్రభాస్ లాంటి కటౌట్‌ని పెట్టుకుని ఓరేంజ్ ఫైట్ సీన్ లేకపోతే, అది సినిమాకే అవమానం. కాబట్టి సలార్‌ని మించే ఫైట్ సీన్లు కూడా డిజైన్ చేశాడట మారుతి.
మొత్తంగా చాలా కాలం తర్వాత డార్లింగ్ స్టైల్లో కామెడీ, బాహుబలి రేంజ్‌లో ఫాంటసీ, సలార్ రేంజ్‌లో ఫైట్ సీన్లు కలిపి మొత్తంగా.. ఒక్క టిక్కెట్‌కి మూడు సినిమాలు చూసిన అనుభూతి ఖాయమంటున్నారు. ఇక ఈమూవీలో 120 కోట్లు పెట్టి గ్రాఫిక్స్‌కే ఖర్చు చేస్తున్నారంటే, ది రాజాసాబ్.. ఏరేంజ్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌తో మతిపోగొట్టబోతోందో అర్ధం చేసుకోవచ్చు. కల్కి సీరియస్ జోనర్‌లో వస్తుంటే, ఫన్నీ రూట్లో ది రాజా సాబ్ మైండ్ బ్లాంక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.