PRASANTH VARMA: రాజమౌళితో పోల్చుకునేందుకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కంగారు పడే పరిస్థితి. మణిరత్నం ఎంత క్లాస్ డైరెక్టర్ అయినా రాజమౌలి మార్గంలోనే వెళ్లి పొన్నియన్ సెల్వం రెండు భాగాలు తీశాడన్నాడు. అలాంటి జక్కన్న పక్కనే ఇప్పుడు ఓ లోబడ్జెట్ మూవీతో చేరిపోయాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి వచ్చిన రెస్పాన్స్, వసూళ్లు, గ్రాపిక్స్‌కి వచ్చిన కాంప్లిమెంట్స్.. ఇవన్నీ తనని పాన్ ఇండియా డైరెక్టర్‌గా మార్చాయి.
Mukesh Ambani: రిటర్న్ గిఫ్ట్ అదుర్స్.. అతిథులకు అంబానీ ఫ్యామిలీ రిటర్న్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..
కాంతారా దర్శకుడు రిషబ్ శెట్టి కూడా అలానే ఫోకస్ అయ్యాడు. కార్తికేయతో చందూ మొండేటికి కూడా పాన్ ఇండియ డైరెక్టర్‌గా గుర్తింపు దక్కింది. వీళ్లంతా సీక్వెల్స్‌తో కూడా ఇదే రేంజ్‌లో హిట్ మెట్టెక్కితే, రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, శంకర్, మణిరత్నం లాంటి డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరినట్టే. ప్రజెంట్ హనుమాన్ సీక్వెల్.. జై హనుమాన్ పనులు మొదలెట్టేశాడు ప్రశాంత్ వర్మ.
కాంతారా ప్రీక్వెల్ గ్లింప్స్ షాక్ ఇచ్చింది. కార్తికేయ 3 మూవీని తండేల్ తర్వాత తెరకెక్కించేందుకు ఫిల్మ్ టీం రెడీ అయ్యింది. ఏదేమైనా సీక్వెల్స్‌తో వీళ్లు సక్సెస్‌ని కంటిన్యూ చేస్తే, పాన్ ఇండియా డైరెక్టర్స్‌గా రేంజ్ మారేలా ఉంది.