PRASANTH VARMA: వివాదంలో వర్మ.. హనుమాన్ డైరెక్టర్‌‌పై విమర్శలు..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ప్రశాంత్‌ మాట్లాడిన ప్రతీ మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అలా మాట్లాడిన ఓ మాటే.. అతన్ని కాంట్రవర్సీలోకి నెట్టేసింది. హనుమాన్‌ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రభాస్ ఆదిపురుష్‌తో కంపారిజన్ వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 06:28 PM IST

PRASANTH VARMA: హనుమాన్‌ కాదు.. హనుమ్యాన్ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఓవర్సీస్‌ నుంచి నైజాం, సీడెడ్‌ వరకు.. రిలీజ్ అయిన ప్రతీచోట రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికీ వీకెండ్స్‌ హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. హనుమాన్ ప్రభంజనం ఏం రేంజ్‌లో ఉంది అని ! ఈ మూవీతో ప్రశాంత్ వర్మ.. టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లోకి వెళ్లిపోయాడు. హనుమ్యాన్‌కు సీక్వెల్‌.. జై హనుమాన్‌ మూవీ కూడా మొదలుపెట్టేశాడు.

PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులకు మోదీ సూచనలు

ఐతే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ప్రశాంత్‌ మాట్లాడిన ప్రతీ మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అలా మాట్లాడిన ఓ మాటే.. అతన్ని కాంట్రవర్సీలోకి నెట్టేసింది. హనుమాన్‌ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రభాస్ ఆదిపురుష్‌తో కంపారిజన్ వినిపిస్తోంది. ఆ బడ్జెట్ ఏంటి.. ఈ బడ్జెట్‌ ఏంటి.. ప్రశాంత్ వర్మ ఎంత అద్భుతంగా తీశాడు అంటూ.. ప్రశంసలు వినిపిస్తున్నాయ్. ఐతే అదే ఆదిపురుష్‌ మీద ప్రశాంత్ చేసిన కామెంట్లు ఇప్పుడు వివాదానికి దారి తీశాయ్. ఆదిపురుష్‌ సినిమాలో కొన్ని సీన్లు.. తాను బాగా చేసే వాడిని అని చెప్పిన ప్రశాంత్‌ మాటలు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. రాజమౌళి మీద కూడా ప్రశాంత్‌ కొన్ని కామెంట్లు చేశాడు. దీంతో ప్రశాంత్‌ వ్యక్తిగతంగా చాలావరకు లాస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. లేనిపోని వివాదాలను మీద వేసుకోవడం ఎందుకు.. ప్రశాంత్ వర్మ నీకు ఇవన్నీ అవసరమా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్.

ఇదంతా ఎలా ఉన్నా.. ప్రశాంత్ నెక్ట్స్ మూవీ జైహనుమాన్‌లో హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరు అనే చర్చ క్యూరియాసిటీ పీక్స్‌కు చేరింది. ఓ టాప్ హీరో హనుమంతుడిగా యాక్ట్ చేస్తున్నారంటూ ఇప్పటికే లీక్ అవ్వగా.. అభిమానులు ఎవరికి నచ్చిన పేరు వారు ఊహించేసుకుంటున్నారు. హనుమ్యాన్‌లో హనుమంతుడి కళ్లు మాత్రమే చూపిస్తారు. దీంతో వాటిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్‌. చిరంజీవి, రాంచరణ్‌లో ఒకరు అని కొందరు.. రానా అని ఇంకొందరు.. వరుణ్‌తేజ్ అని మరికొందరు.. ఇలా ఎవరికి వారు.. హనుమాన్ పాత్రలో తమ అభిమాన హీరోని ఊహించేసుకొని లెక్కలు వేసుకుంటున్నారు.