సలార్ (Salaar) తర్వాత ప్రశాంత్ నీల్ (Prashant Neil) నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. క్రేజీ లైనప్ సెట్ చేసుకున్నప్పటికీ.. నెక్స్ట్ సెట్స్ పైకి వెళ్లే సినిమా ఏది? అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ నిన్న మొన్నటి వరకు సలార్ పార్ట్ 2 (Salaar 2 Shooting) శౌర్యాంగ పర్వం షూటింగ్‌కు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. దేవర, వార్2 ప్రాజెక్ట్స్ తర్వాతే ఎన్టీఆర్ 31 ఉంటుందని వినిపించింది. కానీ ఇప్పుడు సడెన్‌గా ఎన్టీఆర్‌తో మీటింగ్ పెట్టాడు ప్రశాంత్ నీల్. దీంతో ఏది ముందు? ఈ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు? అనే చర్చ జరుగుతోంది.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్ లేటెస్ట్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని తెలుస్తోంది. సినిమా గురించి కొన్ని కీలక విషయాలు మాట్లాడుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇంట్లోనే వీరిద్దరూ తమ ప్రాజెక్ట్ పై చాలా సేపు చర్చించారట. దీంతో.. త్వరలో ఎన్టీఆర్ 31 షూటింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
ఇప్పటికే కొంత వరకు సలార్ 2 షూటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి.. ఎన్టీఆర్ 31 ఈ ఇయర్ ఎండింగ్‌లో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఈ సినిమా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఎన్టీఆర్ కోసం ఇప్పటివరకు చేయని పాత్రను, డిఫరెంట్ స్టోరీ రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ప్రశాంత్ నీల్ సలార్ 2, ఎన్టీఆర్ దేవర(Devara), వార్2 (War 2) తర్వాతే ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ ఈ సడెన్ మీటింగ్ ఏంటనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.