చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్ (Hanuman) సినిమా ఎంత పెద్ద హిట్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.. సంక్రాంతి సీజన్ లో రిలీజైన ఏ సినిమా కూడా సాధించని రేర్ ఫీట్ హనుమాన్ సాధించింది. 300 కోట్ల కలెక్షన్స్ తో హనుమాన్ ఎవర్ గ్రీన్ హిట్ అనిపించుకుంది. నెల రోజులు దాటిన తర్వాత కూడా 300 కేంద్రాల్లో ఇంకా రన్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో.. హనుమాన్ సినిమా సక్సెస్ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా క్రేజీ టాపిక్ గా మారింది. తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ (Prashant Varma) తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో.. దర్శకుడు ప్రశాంత్ వర్మ రేంజ్ ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. హనుమాన్ గ్రాండ్ సక్సెస్ తో ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జై హనుమాన్ సినిమాలో హీరో ఎవరన్నదానిపై ఇప్పుడు హాట్ డిస్కషన్ నడుస్తోంది.
జై హనుమాన్ (Jai Hanuman) కన్నా ముందు ప్రశాంత్ వర్మ అధీర, మహాకాళి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ పూర్తి చేసి జై హనుమాన్ షూటింగ్ ప్రారంభించాలి. ఇక ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ కంటే చాలా ఎక్కువ బడ్జెట్, స్కేల్‌తో తీయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను ఇప్పటికే మొదలుపెట్టాడు. జై హనుమాన్ లో స్టార్స్ కూడా ఉంటారని హింట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.. సో హనుమాన్ కి పర్ఫెక్ట్ సీక్వెల్ గా మరింత భారీగా జై హనుమాన్ ఉండబోతుంది. ఇక.. ఈ సీక్వెల్‌లో స్వామి హనుమ పాత్రను కేజీఎఫ్ హీరో యష్ పోషించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే జై హనుమాన్ చిత్రం మొత్తం పూర్తిగా హనుమంతుని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దీంతో ఈ పాత్రని ఓ స్టార్ హీరో చేస్తారని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో ప్రశాంత్ వర్మ చెప్పాడు. అయితే ఈ రోల్‌ను హీరో రానా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా యష్ పేరు వినిపిస్తోంది.
నిజానికి జై హనుమాన్‌లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. దాదాపుగా ఆ వార్తకు అందరూ ఫిక్సయిపోయారు కూడా.. అయితే.. చిరు హనుమాన్‌కి వీరభక్తుడు కాబట్టే తన దేవుడి పాత్ర ఒప్పుకోరని అంటున్నారు. సో.. జై హనుమాన్ మూవీలో హీరో సెలక్షన్ ఇప్పుడు ప్రశాంత్ వర్మకి అతి పెద్ద భారీ టాస్క్‌గా మారింది. ప్యాన్ ఇండియా (Pan India) ఇమేజ్ ఉన్న వాళ్ళను తీసుకుంటే రీచ్ ప్లస్ బిజినెస్ రెండూ పెరుగుతాయని ప్రశాంత్ వర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా అనుకున్న విధంగా హనుమాన్ మెచ్చిన ప్రేక్షకులందరినీ జై హనుమాన్ కూడా సూపర్ అనిపించేలా మూవీ తీయాల్సిందే. అందుకు ప్రశాంత్ వర్మ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిందే. మరి హనుమాన్ తోనే బీభత్సం సృష్టించిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో ఇంకెంతటి ప్రభంజనాలు సృష్టిస్తాడన్నది చూడాలి.