కేజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు మార్మోగిపోతుంది. ఆ తర్వాత సలార్ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం స్టార్ హీరోలు క్యూలో ఉన్నారు. మనాడి దగ్గర కథ, కొంచెం బూడిద ఉంటే చాలు సినిమా సెట్స్ పైకి వెళ్ళినట్టే. నిర్మాణ సంస్థలు కూడా ఈయనకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ప్రశాంత్ అడ్రస్ కు పోస్ట్ కోడ్ తో పని లేదు. ఫోన్ కాల్ తో సినిమా సెట్ అయిపోతుంది అనే మాట వాస్తవం. ఇప్పుడు ప్రశాంత్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా ఇటీవల గ్రాండ్ గా మొదలయింది.
వచ్చే ఏడాది ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి. ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ఏ సినిమాలో కూడా హీరో పాత్రకు తండ్రి కనపడకపోవడం జనాలకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మ ప్రేమ సెంటిమెంట్ తో సినిమాలు చేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఉగ్రం సినిమాలో అమ్మ ప్రేమకె ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన కేజిఎఫ్ సీరీస్ లో వచ్చిన రెండు సినిమాల్లో కూడా తల్లి పాత్రే హైలెట్ అయింది. కేజిఎఫ్ ఫస్ట్ పార్ట్ లో తల్లి సెంటిమెంట్ సూపర్ హిట్ అయింది.
రెండో పార్ట్ లో అంతగా ఆకట్టుకోలేదు గాని కొన్ని సీన్స్ లో అమ్మలనే చూపించాడు ప్రశాంత్. ఇక సలార్ సినిమాలో కూడా అంతే. ఈశ్వరి రావు హీరోకి తల్లి పాత్ర పోషించారు. ఇక్కడ కూడా తల్లి సెంటిమెంట్. దీనితో జనాలకు ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తున్నాయి. మనాడికి తండ్రి అంటే కోపమా లేక తల్లి అంటే ఇష్టమా అంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. కేజిఎఫ్ సినిమాలో తండ్రిని ఒకరకంగా విలన్ గా చూపించాడు. తాగుబోతుగా చూపించి చివర్లో భార్య సమాధి వద్దకు తెచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అసలు తండ్రి పాత్ర ఉండవచ్చా మళ్ళీ తల్లి సెంటిమెంట్ తో సినిమా చేస్తాడా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు.