Prashanth Neel: ఒకేసారి ఇద్దరు పాన్ ఇండియా స్టార్లతో ఊహించని సాహసం..?

ప్రభాస్‌తో సలార్ 2, ఎన్టీఆర్‌తో ఓ మూవీ సమాంతరంగా తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. దానికి తగ్గట్టే ప్లానింగ్ జరిగిపోతోంది. సలార్ 2 స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయ్యింది. మే, జూన్‌లో సలార్ సీక్వెల్ షూటింగ్ జరగబోతోంది.

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 08:50 PM IST

Prashanth Neel: రెబల్ స్టార్ ప్రభాస్‌తో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో ఒకేసారి సినిమా తీయడం ఈజీ టాస్క్ కాదు. కానీ, ఆ సాహసానికి రెడీ అయ్యాడు పాన్ ఇండియా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నిజంగానే ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లతో ఒకేసారి రెండు వేరు వేరు సినిమాలను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ విషయంలో డైరెక్టర్ శంకర్ రూట్లో నడవబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఒక వైపు భారతీయుడు 2, మరో వైపు గేమ్ ఛేంజర్ అంటూ ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కించాడు శంకర్.

Janhvi Kapoor: జాన్వీక‌పూర్ ఇంట అంబానీ పిల్ల‌లు.. రాయ‌ల్ పార్టీ ఇచ్చిన జాన్వీ

అచ్చంగా అలాగే ప్రభాస్‌తో సలార్ 2, ఎన్టీఆర్‌తో ఓ మూవీ సమాంతరంగా తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. దానికి తగ్గట్టే ప్లానింగ్ జరిగిపోతోంది. సలార్ 2 స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయ్యింది. మే, జూన్‌లో సలార్ సీక్వెల్ షూటింగ్ జరగబోతోంది. మే నెలంతా ప్రభాస్ లేని సీన్లను తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. జూన్‌లో ప్రభాస్ సలార్ 2 కోసం డేట్లు కేటాయించబోతున్నాడు. ఇక మేలో రావాల్సిన కల్కి జులై సెకండ్ వీక్‌లో రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు సలార్ 2 షూటింగ్ కంటిన్యూ అవుతుందట. ఆ తర్వాత ది రాజాసాబ్, సలార్ 2 రెండూ కూడా ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్ జరుగుతాయని, ఆ తర్వాతే స్పిరిట్ లేదా, హను రాఘవపూడి మూవీ సెట్స్ పైకెళుతుందని తెలుస్తోంది. ఇంత అంర్జెంట్‌గా సలార్ 2ని పూర్తి చేయాలనుకోవటానికి రెండు కారణాలున్నాయి.

వచ్చే సమ్మర్‌లోగా సలార్ అందుబాటులో ఉండాలి. అలాగే అక్టోబర్ కల్లా సలార్ 2 మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోతే, ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ని ప్రశాంత్ నీల్ పట్టాలెక్కించాలి. ఈ రెండు నిర్ణయాలవల్లే సలార్ 2 ని ముందుగా, ఎన్టీఆర్ సినిమాను అక్టోబర్‌లో ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇలా అక్టోబర్ నుంచి జనవరి వరకు అటు తారక్, ఇటు ప్రభాస్ సినిమా సెట్ల మద్య ప్రయాణం చేస్తూ రెండు పడవల ప్రయాణం చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్.