PRASHANTH NEEL: నీల్-ఎన్టీఆర్ 31.. సలార్ సక్సెస్ మీట్‌లో చెప్తాడా? 

సలార్ నుంచి కంప్లీట్‌గా బయటకొచ్చిన వెంటనే ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 07:56 PM IST

PRASHANTH NEEL: సలార్ 2 రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది. NTR31 వర్కింగ్ టైటిల్‌తో ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా మైథలాజికల్ టచ్‌తో, యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఉంటుందని ఒక ప్రచారం నడుస్తోంది.

SALAAR: సలార్‌కి పోటీ ఇచ్చే సత్తా.. డంకీ, ఆక్వామ్యాన్ 2కి లేదా..?

భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత వీలైనంత వేగంగా సలార్ 2ని కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సలార్ నుంచి కంప్లీట్‌గా బయటకొచ్చిన వెంటనే ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్, సలార్ సిరీస్ తరహాలోనే ఎన్టీఆర్ 31 మూవీ కూడా రెండు భాగాలుగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టొరీ ఐడియా సిద్ధంగా ఉందని, కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్‌లో బెస్ట్ మూవీలో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

ప్రస్తుతం తారక్.. కొరటాల శివతో దేవర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగానే తెరకెక్కుతోంది. దీని తర్వాత వార్ 2 ఉంటుంది. అది కంప్లీట్ చేసిన అనంతరం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యే ఛాన్స్ ఉందని టాక్. మరి ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.