Prashanth Varma: పూనకాలు లోడింగ్.. బాలకృష్ణతో ప్రశాంత్‌ వర్మ.. క్లారిటీ వచ్చేసింది..!

నందమూరి బాలకృష్ణ, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రశాంత్‌.. తాను బాలకృష్ణకు స్టోరీ లైన్‌ చెప్పానని, అది బాలయ్యకు కూడా బాగా నచ్చిందని క్లారిటీ ఇస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 05:18 PM IST

Prashanth Varma: కొంతమంది దర్శకులు తమ సినిమాల్లో కొత్తదనం ఉండాలని కోరుకుంటారు. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన కథాంశాలతోనే సినిమాలు తీసేందుకు ఆసక్తి కనబరుస్తారు. సినిమా అంటే ఇలా కూడా ఉంటుందా అనే లెవల్‌లో వారి సినిమాలు ఉంటాయి. అలాంటి ఓ విభిన్నమైన శైలి కలిగిన దర్శకుడు ప్రశాంత్‌వర్మ. అతని డైరెక్షన్‌లో వచ్చిన ‘అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ చిత్రాలే దానికి నిదర్శనం. తాజాగా ఆ మూడు సినిమాలకు భిన్నంగా ‘హనుమాన్‌’ అనే సూపర్‌ హీరో సినిమాతో వస్తున్నాడు.

Venu Swamy: ప్రభాస్‌‌ను టార్గెట్ చేసిన వేణుస్వామి.. దొరికితే ఇరగదీస్తామంటున్న ఫ్యాన్స్

తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాపై ప్రశాంత్‌వర్మ ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. అందుకే భారీ చిత్రాల మధ్య జరిగే సంక్రాంతి పోటీకి తానూ సిద్ధమేనంటున్నాడు. భారీ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ‘హనుమాన్‌’ రూపొందిందని చెబుతున్నాడు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచుతున్నాడు. ఇదిలా ఉంటే.. ‘హనుమాన్‌’ తర్వాత తాను చేయబోయే సినిమాకి సంబంధించిన విశేషాలను కూడా రివీల్‌ చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రశాంత్‌.. తాను బాలకృష్ణకు స్టోరీ లైన్‌ చెప్పానని, అది బాలయ్యకు కూడా బాగా నచ్చిందని క్లారిటీ ఇస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే తెలియచేస్తానంటున్నాడు.

ఇదిలా ఉంటే.. బాలయ్య ఎప్పుడు కాల్‌ చేసి స్క్రిప్ట్‌ రెడీ చేయమంటే అప్పుడు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నాడు ప్రశాంత్‌. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అంటూ అడిగిన ప్రశ్నకు బాలయ్యతో తాను చేయబోయే సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు ప్రశాంత్‌. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఎవరూ టచ్‌ చేయని ఒక డిఫరెంట్‌ పాయింట్‌తో బాలయ్య సినిమా ఉంటుందట. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం.