Praveen Sattaru: వరుణ్ తేజ్ కెరీర్‌లో హిట్లున్నాయి, ఫెల్యూర్స్ ఉన్నాయి. కాని తలెత్తుకోలేనంత డిజాస్టర్ అంటే గాండీవధారి అర్జున మూవీనే. ప్రవీన్ సత్తారు ఈ హీరో కొంపముంచాడు. అది కూడా ఎఫ్-3 లాంటి హిట్ తర్వాత. విషయం ఏంటంటే ఈ డైరెక్టర్ వరుణ్ తేజ్ కంటేముందు కింగ్ నాగార్జునకి ఇలాంటి డిజాస్టరే గిఫ్ట్‌గా పార్శిల్ పంపాడు. ఏదో పీఎస్‌వీ గరుడవేగ అంటూ హిట్ సొంతంచేసుకున్న ప్రవీణ్ సత్తారు.. రాజశేఖర్‌లాంటి ఔట్‌డేటెడ్ హీరోకే హిట్ ఇచ్చాడంటే, మ్యాటర్ ఉన్న దర్శకుడనుకున్నారు.
నిజంగానే తన మేకింగ్ బాగుంటుంది. కాని తను తీసే సినిమాలో మేకింగ్ తప్పమ్యాటర్ ఉండదు. సింపుల్ గాచెప్పాలంటే తలా తోకా లేని కథని హాలీవుడ్ రేంజ్‌లో తీయాలనకుంటాడు. అక్కడే బొక్క బోర్లా పడతాడు. నాగార్జునతో ది ఘోస్ట్ తీసి కింగ్‌కి షాక్ ఇచ్చాడు. వరుణ్ తేజ్‌తో గాండీవధారి అర్జున అంటూ కథ, కథనంలేని మూవీతో మెగాప్రిన్స్‌కి షాక్ ఇచ్చాడు. నిజానికి మంచి హిట్లతో స్వింగ్‌లో ఉన్నప్పుడే వరున్‌కి ఘనితో పంచ్ పడింది. మళ్లీ ఎఫ్-3 హిట్ తర్వాత చూస్తే గాండీవధారి అర్జునతో ఫ్లాప్ పడింది.
ఇలా కలిసొచ్చే టైంలో కూడా హీరో కెరీర్‌కి పంచ్ ఇచ్చారు దర్శకులు. ఏదో పీఎస్‌వీ గరుడువేగ మూవీతో ఇరగతీశాడని గతంలో ప్రవీణ్ సత్తారుకి.. బాహుబలి వెబ్ సీరీస్ అప్పచెప్పారు. క్వాలిటీ ఔట్‌పుట్ లేదని దాన్ని ఆపేశారు. అప్పటి నుంచి ఒక్క మూవీతో కూడాహిట్ మెట్టెక్కలేకపోయాడు ఈ దర్శకుడు.