ఊచకోత అంటే ఇలా ఉండాల, సినిమా జాతర అంటే ఇలా జరగాల… సినిమాకు బజ్ అంటే ఇలా క్రియేట్ అవ్వాల, హైప్ అంటే ఈ రేంజ్ లో ఊపాల… ఇప్పుడు దేవరకు భాషతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు. రాష్ట్రంతో సంబంధం లేదు… ప్రీ బుకింగ్ మార్కెట్ ఓపెన్ అయితే చాలు తొక్కుకుంటూ పోతుంది. అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ దెబ్బకు హాలీవుడ్ జనాలు కూడా షేక్ అయ్యారు. ఇక హిందీలో అయితే సినిమా టికెట్ ల కోసం ఎగబడుతున్నారు. సినిమా హిట్ టాక్ రాక ముందే దేవర సునామీ… ఇండియన్ సినిమాను కమ్మేసింది.
ప్రీ బుకింగ్ మార్కెట్ భాషతో సంబంధం లేకుండా ఓ రేంజ్ లో జరుగుతోంది. అమెరికాలో సలార్ రికార్డులు తొక్కింది దేవర. ఇప్పుడు బెంగళూరులో అక్కడి స్టార్ హీరోలను కూడా షేక్ చేసేస్తోంది. ఎప్పుడో అరవింద సమేత సినిమా ఎన్టీఆర్ హీరోగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దేవరతో ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు. దీనితో కన్నడ మార్కెట్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఒక్క బెంగళూరు నగరంలోనే దేవర 4 కోట్ల ప్రీ బుకింగ్ మార్కెట్ క్రాస్ చేసిందంటే బజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఓపెన్ అవ్వడం ఆలస్యం ఎగబడుతున్నారు జనాలు.
సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు ఉంది. ఈ మూడు రోజుల్లో ఏ రికార్డులు బద్దలు అవుతాయో చూడాలి. సినిమా ఎలా ఉంటుందో తెలియక ముందే ఈ రేంజ్ లో ఉంటే… హిట్ అనే మాట వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సినిమా విషయంలో చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. అటు తమిళనాడు మార్కెట్ కూడా భారీగా జరిగే అవకాశం కనపడుతోంది. మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో చూడాలి. హైదరాబాద్ లో కూడా ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బెనిఫిట్ షోస్ కి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది…