ఇల్లు మనది కాబట్టి బయటకు వినపడకుండా తిట్టుకుందాం” ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తుంది ఇదే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది రిలీజ్ కు ముందు ఏ పెంట గోల వద్దు… ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోగతం ఇది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఫ్యాన్స్ కు ఆదివారం సాయంత్రం కళ్ళల్లో నుంచి రక్తం కారింది. ఎన్టీఆర్ ను చూడటానికి ఎన్టీఆర్ మాట వినడానికి చాలా ఆశగా ఎదురు చూసారు. పనులు మానుకుని, బస్ టికెట్ లు, ట్రైన్ టికెట్ లు బుక్ చేసుకుని వచ్చారు.
కాని చివరికి చూస్తే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అనే వార్త బయటకు వచ్చింది. తర్వాత ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చారు. అక్కడి వరకు ఓకే గాని… ఇప్పుడు సెంటిమెంట్ భయంతోనే ఈవెంట్ ను రద్దు చేసింది చిత్ర యూనిట్ అనే వార్తలు వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనుక ప్రీ ప్లాన్ ఉందంటున్నారు జనాలు. అసలు ఏంటి ఆ సెంటిమెంట్ అనేది చూద్దాం. సరిగా 11 ఏళ్ళ క్రితం… అంటే 2013 సెప్టెంబర్ 22వ తేదీన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య సినిమా ట్రైలర్ విడుదల అయింది.
సరిగా అదే రోజున అంటే… 22 సెప్టెంబర్ న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి, ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేసారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది అప్పుడు. ఇప్పుడు ఆ భయం వెంటాడి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమో అనే భయంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసి ఉంటారని అంటున్నారు సినీ జనాలు. అందుకే ఈవెంట్ లో కాకుండా మధ్యాహ్నమే ట్రైలర్ విడుదల చేసారని టాక్. సాధారణంగా రిలీజ్ ట్రైలర్ ను ఈవెంట్ లో విడుదల చేస్తారని, రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించే ప్లాన్ చేసారని టాక్ వచ్చింది. కాని ముందే విడుదల చేసారు. అసలు ఈవెంట్ కి ఎవరు వస్తున్నారో కూడా క్లారిటీగా చెప్పలేదు. సాధారణంగా ఎవరు వస్తున్నారో ముందే వార్తలు వస్తాయి. కాని ఈ సినిమాకు మాత్రం అలా జరగలేదు. ముందు అనుకునే క్యాన్సిల్ చేసారని మండిపడుతున్నారు జనాలు.