mamitha baiju: ఏం మాయ చేశావే.. పిచ్చోళ్లైపోతున్నారు..

మమిత బైజు ఏం చేసిందంటే.. ముందుగా రాజమౌళి మనసు దోచింది. తన పాత్రకి, పెర్ఫామెన్స్‌కి జక్కన్నే ఫిదా అయ్యాడు. ఇక యంగ్‌స్టర్స్ పరిస్థితేంటి..? అదే జరిగింది. ప్రేమలు మూవీ కథేమి కళాఖండం కాదు.

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 09:25 PM IST

mamitha baiju: మమితా బైజు.. ఈ పేరు వినగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో యూత్‌కి మతిపోతోంది. తన గురించి గూగుల్‌లో సెర్చ్‌లు, తన నవ్వు మీద సోషల్ మీడియాలో మీమ్స్‌తో కామెడీ కవిత్వాలు వస్తున్నాయి. అన్నింటికి మించి ప్రేమలు మూవీ పాటలకు ఇన్‌స్టాలో రీల్స్ పెరిగిపోయాయి. అంతగా మమిత బైజు ఏం చేసిందంటే.. ముందుగా రాజమౌళి మనసు దోచింది. తన పాత్రకి, పెర్ఫామెన్స్‌కి జక్కన్నే ఫిదా అయ్యాడు. ఇక యంగ్‌స్టర్స్ పరిస్థితేంటి..? అదే జరిగింది.

Deepika Padukone: కల్కి రిలీజ్ టైం దగ్గర పడుతున్న వేళ షాకిచ్చిన దీపిక

ప్రేమలు మూవీ కథేమి కళాఖండం కాదు. కాని కదిలించే సీన్లు, కామెడీ కితకితలు కావాల్సినన్ని ఉన్నాయి. వాటికి గ్లామర్ అద్దింది మాత్రం మమిత బైజునే. తను రీసెంట్‌గా ఓ ప్రోగ్రామ్‌లో చేసన డాన్స్ వీడియో పెడితేనే లక్షల్లో లైక్స్ వచ్చాయి. అంటే మమిత బైజుకి తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫాలోయింగ్ పెరిగిందో చెప్పక్కర్లేదు. మలయాళంలో 3 కోట్లు పెడితే వందకోట్లొచ్చిన ప్రేమలు మూవీ, తెలుగులో మరీ అంత కాకున్నా, బాగానే ఆడుతోంది. నిదానంగా పుంజుకుంటోంది. సినిమా ఎలా ఉన్నా మమిత బైజు నవ్వుకి ఇక్కడ యంగ్‌స్టర్స్ మనసు చెదిరిపోయినట్టుంది.

అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఆ లేడీకి ఫ్యాన్స్ అయిపోయారు. అప్పట్లో ఒరు ఆదార్ లవ్ మూవీ తాలూకు ఓ పాట ఇలానే ఫోకస్ అయ్యింది. కన్ను కొట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ ఇలానే ఫేమస్ అయ్యింది. మరి ఆ కుట్టిలానే మమితా మిగిలిపోతుందా? లేదా అనేది టైం గడుస్తుంటే కాని చెప్పలేం.