Premalu Review: కథా లేదు.. కాకరకాయ లేదు.. కాని క్యా సీన్ హై..!

ఏదో గల్లిలో ఓ కుర్రాడి బ్రేకప్ సీన్లే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో.. ప్రేమలు మూవీ కంటెంట్ అలా ఉంది. కాబట్టి కథ, కాకరకాయ లాంటివేం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇక పాత్రలు, పెర్ఫామెన్స్‌కి మాత్రం వంకపెట్టలేం.

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 04:05 PM IST

Premalu Review: ప్రేమలు.. పక్కా మలయాళం మూవీ. అక్కడ 90 కోట్లు రాబట్టింది అన్నారు. ఇక్కడ కూడా వందకోట్లు రాబడుతుందన్నారు. తీరా చూస్తే మాళీవుడ్ నుంచి వచ్చే రెగ్యులర్ సినిమాల్లోలాగే ఇందులో పూనకాలు తెప్పించే కథ కాని, కథనం కాని ఏం లేవు. వెరీ రొటీన్.. రెగ్యులర్ లవ్ స్టోరీ. హీరో ఒకమ్మయిని ప్రేమిస్తాడు. తనకి ప్రపోజ్ చేస్తే, తను ఆల్రెడీ ప్రేమలో ఉందంటుంది. అలా లవ్ షాక్ ఇవ్వటంతో హైద్రబాద్ కొచ్చి గేట్ కోచింగ్ లో జాయిన్ అవుతాడు.

Bhimaa Review: మాస్ జాతర.. భీమా ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్

ఇక్కడ తన మనసు మళ్లీ స్పందిస్తుంది.. ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంది. కాని తను మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అంటుంది. ఇదే సినిమా కథంటే నమ్ముతారా. ఏదో గల్లిలో ఓ కుర్రాడి బ్రేకప్ సీన్లే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో.. ప్రేమలు మూవీ కంటెంట్ అలా ఉంది. కాబట్టి కథ, కాకరకాయ లాంటివేం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇక పాత్రలు, పెర్ఫామెన్స్‌కి మాత్రం వంకపెట్టలేం. సినిమాలో కథని వెతికే కంటే, కామెడీని రిసీవ్ చేసుకుంటే చాలు. అక్కడ మాత్రం వంకపెట్టలేనంతగా డైరెక్టర్ నవ్వించాడు. ఆ కామెడీని సాగతీతలా అనిపించకుండా జాగ్రత్త పడ్డాడు.

అలా చూస్తే ఇది మ్యాడ్ మూవీ, జాతిరత్నాలు జోనర్‌లోకి వెళ్లే సినిమానే. కథ కాకరకాయ్ లాంటివే లేకుండా, ఓ మాదిరి పాయింట్‌కి సినిమా అనే చొక్కా తొడిగేసింది ఫిల్మ్ టీం. ఏదైతేనేం.. హైద్రాబాద్ లొకేషన్లు, పర్లేదనిపించే మాటలు, కితకితలుపెట్టే సీన్లు మొత్తంగా ఫుల్ టైం పాస్ మూవీ. అంతకు మించి కళా ఖండాలు ఎక్స్‌పెక్ట్ చేస్తే కష్టమే.