The Goat Life: ది గోట్‌లైఫ్.. ఆడు జీవితం.. ఎలా ఉంది..? మినీ రివ్యూ..

కేరళకు చెందిన నజీబ్ వసలకూలీగా సౌదీ అరేబియా వెళ్లి, బానిసగా బతకటం, ఆ జీవితం నుంచి బయట పడేందుకు తను ఏడారిలో చేసిన ప్రయాణమే కథ. నజీబే తన రియల్ లైఫ్ స్టోరీని ఆడు జీవితం అంటూ నవలగా రాస్తే దాన్నే బ్లెస్సీ హార్ట్ సినిమాగా తెరకెక్కించాడు.

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 06:24 PM IST

The Goat Life: ది గోట్ లైఫ్ మూవీ పృథ్వీరాజ్ సుకుమారన్ 16 ఏళ్ల కల. ఎప్పుడో 2008లో రావాల్సిన సినిమా పదహారేళ్ల తర్వాత వచ్చింది. ఈ సినిమాలో బక్కచిక్కిన లుక్ కోసం పృథ్వీరాజ్ 31 కేజీలు బరువు తగ్గాడు. ఈ రోజే సినిమా రిలీజైంది. ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఇక ది గోట్ లైఫ్.. ఆడు జీవితం కథ విషయానికొస్తే, కేరళకు చెందిన నజీబ్ వసలకూలీగా సౌదీ అరేబియా వెళ్లి, బానిసగా బతకటం, ఆ జీవితం నుంచి బయట పడేందుకు తను ఏడారిలో చేసిన ప్రయాణమే కథ.

RAM CHARAN: శంకర్ నిర్ణయంతో పవన్, బన్నీ సినిమాలకు షాక్..!

నజీబే తన రియల్ లైఫ్ స్టోరీని ఆడు జీవితం అంటూ నవలగా రాస్తే దాన్నే బ్లెస్సీ హార్ట్ సినిమాగా తెరకెక్కించాడు. ది గోట్ లైఫ్ కథ, ఎంతగా కదిలిస్తుందో, దాన్ని నెరేట్ చేసిన విధానం అంతగా ఆకట్టుకుంటుంది. నజీబ్ పాత్రలో పృథ్విరాజ్ సుకమారన్ చాలా వేరియేషన్స్‌లో కనిపించాడు. అందుకోసం తను చేసిన హార్డ్ వర్క్ లుక్‌లో కనిపిస్తుంది. ఇక ఎడారిలో ఒక వ్యక్తి ప్రయాణం చూపించటం అంటే రిస్క్ ఎక్కువే. ఈజీగా బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. కాని కొన్ని పాత్రల్నే పెట్టి, ఎడారిలాంటి యాంబియెన్స్‌లో ఆడియన్స్‌ని కుర్చీలోంచే లేవకుండా కథ చెప్పడం కత్తి మీద సామే. అదే బ్లెస్సీ టీం చేసింది. కమల్ హాసన్ అయితే, ఇంటర్వెల్ ముందు ఆడియన్స్‌కి కూడా దాహం వేసేలా సినిమా నెరేషన్ ఉందన్నాడంటే, కంటెంట్ ఏ లెవల్లో ఉందో ఊహించుకోవచ్చు.

అంతగా ప్రతీ ఒక్కరు పాత్రల్లో లీనమైతే, రెహమాన్ ఆ ఎడారికెళ్లి లొకేషన్లు చూసి స్ఫూర్తి పొంది మరీ మ్యూజిక్ ఇచ్చాడు. అందుకే ఆ ఔట్‌పుట్ అంతగా కదిలిస్తోంది. కథ, కథనం, డైరెక్షన్, నటుల పెర్పామెన్స్, మ్యూజిక్ ఇలా అన్నింటికీ మంచి మార్కులే పడుతున్నాయి. ఎటొచ్చి, రెగ్యులర్ మూవీస్‌కి అలవాటు పడే జనానికి ఇది అంతగా ఎక్కకపోవచ్చనే రొటీన్ కామెంట్ పక్కన పెడితే, మిగతాదంతా సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే కంటెంటే.